వెలగపూడి : ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను
ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. అనంతరం సభ వాయిదా పడింది. ఆ
తర్వాత అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని ఆధ్వర్యంలో బీఏసీ సమావేశం జరిగింది. ఈ
సమావేశంలో 9 రోజుల పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని
నిర్ణయించారు. ఈ నెల 24 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. 16వ తేదీన రాష్ట్ర
బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 19, 22వ తేదీల్లో అసెంబ్లీకి సెలవు
ఉంటుంది. బీఏసీ సమావేశం ముగిసిన తర్వాత కేబినెట్ సమావేశం ప్రారంభమయింది.
ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నిర్వహించారు.