ఎపిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు
ఛలో రాజ్ భవన్ కార్యక్రమం విజయవంతం
విజయవాడ : భారతీయ జనతా పార్టీ దేశంలో ఒకరిద్దరు బడా బాబులకు దాసోహం అయిందని,
దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను వారికి కట్టబెడుతున్నారని, అదానీ ఆర్ధిక
కుంభకోణాలపైన, వారికి మద్దతిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ నిద్రమత్తును
వదిలించడానికి అఖిలభారత కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు ఆంధ్రప్రదేశ్
కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ
వైఖరికి నిరసనగా సోమవారం “ఛలో రాజ్ భవన్” నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
అదానీ ఆర్ధిక కుంభకోణానికి సంబంధించి జాయింట్ పార్లమెంట్ కమిటీ వేసేవరకు
వెనకడుగు వేసేది లేదని ఎపిసిసి అధ్యక్షులు ఖరాఖండిగా చెప్పారు. ప్రభుత్వ రంగ
సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పటానికి అధికారం ఎవరిచ్చారని ప్రధాని
నరేంద్రమోడీని గిడుగు రుద్రరాజు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర
వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అప్రమత్తమయ్యాయని, మోడీ అదానీ భరతం
పట్టేవరకు నిరసన జ్వాలలు ఎగసిపడుతూనే వుంటాయని తీవ్రంగా హెచ్చరించారు.
కేంద్రప్రభుత్వం దిగివచ్చి జాయింట్ పార్లమెంట్ కమిటీ వేసేవరకు కాంగ్రెస్
పార్టీ తనదైన ప్రణాళికలతో ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉంటుందని రుద్రరాజు
తెలిపారు. ఆంధ్రరత్న భవన్ నుండి రాజ్ భవన్ వరకు వేలాదిగా బయలుదేరిన కాంగ్రెస్
శ్రేణులను పోలీసులు అడ్డగించి రుద్రరాజు సహా నాయకులను అరెస్ట్ చేసి విజయవాడ
వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు బిజెపి
వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి, ఏపీ
వ్యవహారాల బాధ్యులు క్రిస్టఫర్ తిలక్, ఎపిసిసి కార్యనిర్వాహక అధ్యక్షులు
షేక్ మస్తాన్ వలి, సుంకర పద్మశ్రీ, పి.రాకేష్ రెడ్డి, ఎపిసిసి సమన్వయ కమిటీ
సభ్యుల ఆర్.శ్రీరామ మూర్తి, ఎపిసిసి ప్రధాన కార్యదర్సులు పరసా రాజీవ్ రతన్,
రాంభూపాల్ రెడ్డి, సి.హెచ్. శ్రీధర్ రెడ్డి, పి.హరికుమార్ రాజు, జిల్లా
అధ్యక్షులు బొర్రా కిరణ్, తాంతియా కుమారి, బొడ్డేపల్లి సత్యవతి, సరగడ రమేష్
కుమార్, మర్నీడి శేఖర్ (బాబ్జి), వంతల సుబ్బారావు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు
నరహరశెట్టి నరసింహారావు, గొంపా గోవింద్, ఎపిసిసి లీగల్ సెల్ చైర్మన్
వి.గురునాధం, కొలనుకొండ శివాజీ, ధనికుల మురళీమోహన్, మేడా సురేష్, మీసాల
రాజేశ్వర రావు, ఎపిసిసి ఆర్టీఐ సెల్ చైర్మన్ పి.వై.కిరణ్, ఖాజా మొహిద్దీన్,
గొల్లు కృష్ణ, పి.నాంచారయ్య, షేక్ సలీం, ఖుర్షీదా, ఆకుల భాగ్యలక్ష్మి,
సుభాషిణి తదితరులు పాల్గొన్నారు.