అమరావతి : టీడీపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పంచుమర్తి అనురాధ
సోమవారం ఉదయం నామినేషన్ ధాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే
బుచ్చయ్య చౌదరి, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప , ఎమ్మెల్యే ఆదిరెడ్డి
భవాని, తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారంతా మీడియాతో మాట్లాడారు. బుచ్చయ్య
చౌదరి మాట్లాడుతూ పంచుమర్తి అనురాధ బలహీన వర్గాల మహిళను టీడీపీ ఎమ్మెల్సీ
అభ్యర్ధిగా నిలబెడుతున్నామన్నారు. తమకు 23 మంది శాసనసభ్యుల మద్దతు ఉందన్నారు.మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ చంద్రబాబు బీసీ అభ్యర్ధికి అవకాశం
ఇచ్చారన్నారు. గ్రాడ్యూయేట్స్, టీచర్లు, స్థానిక సంస్థల ఎన్నికలు
జరుగుతున్నాయని అన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని మాట్లాడుతూ అనురాధ
పార్టీకి, రాష్ట్రానికి ఎంతో సేవ చేశారన్నారు. టీడీపీకి 23 సభ్యుల బలం ఉందని,
తమకు 22 మంది ఉంటే సరిపోతుందని తెలిపారు. అనురాధ తప్పకుండా గెలుస్తారని ధీమా
వ్యక్తం చేశారు. గ్రాడ్యూయేట్స్ ఎ్వవరూ ప్రలోభాలకు గురికాకుండా ఓటు వేయాలని
కోరారు. పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ చంద్రబాబు, లోకేష్ తనను అభ్యర్ధిగా
నిలిపినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. బడుగు బలహీన వర్గాలకు చెందన తనకు సీటు
ఇచ్చారు గనుక అందరూ సహకరించాలని కోరారు.