హరివిల్లు ఫౌండేషన్ ఉచిత కన్సల్టేషన్ సర్వీస్ కార్డ్స్ అవిష్కరణ
విజయవాడ : హరివిల్లు ఫౌండేషన్ఆ ధ్వర్యంలో నిరుపేదలకు అందని ద్రాక్ష లాగా
తయారైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సేవలను అతి పేదవారికి కూడా అందుబాటులో
తెచ్చే విధంగా ప్రత్యేక గుర్తింపు కార్డును ఆవిష్కరించారు. ఆదివారం చల్లపల్లి
బంగ్లా వద్ద ఐఎంఏ హల్ లో హరివిల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో
ఫ్రీ కన్సల్టేషన్ సర్వీస్ కార్డును ముఖ్యఅతిథి పాల్గొన్న ప్రముఖ వైద్యులు
డాక్టర్ జి. సమరం అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరివిల్లు
ఫౌండేషన్ నిరుపేదలకు చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు.వైద్యో నారయణ హరి
అన్నట్టుగా ధన్వంతరి వారసులైన డాక్టర్లు దేవుడుతో సమానమని అన్నారు అనంతరం
హరివిల్లు ఫౌండేషన్ వ్యవస్థాపకులు, కార్యదర్శి ఎం. వి.శరత్ కుమార్
మాట్లాడుతూ నేడు వైద్యం ఖరీదైనదిగా మారిపోయిందని ఆ క్రమంలో నిరుపేదలకు వైద్య
సహాయం అందించాలని ఉద్దేశంతో హరివిల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫ్రీ కన్సల్టేషన్
సర్వీస్ కార్డ్ ని ఇస్తున్నట్లు తెలిపారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లోని
16మంది డాక్టర్ల ద్వారా నిరుపేదలకు ఈ కార్డు ద్వారా ఉచిత కన్సల్టేషన్
ఉంటుందని తెలిపారు. అంతే కాకుండా వైద్య పరీక్షల్లో 40శాతం రాయితీ ఉంటుందని
అన్నారు. నాలుగు ల్యాబ్ ల్లో 50శాతం వరకు ఫీజు రాయితీ ఉంటుందని అన్నారు.
వివరాలకు చిట్టినగర్ లోని తులసి హాస్పిటల్ నందు సంప్రదించాలని కోరారు. నగరంలో
నిరు పేదలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని డాక్టర్ శరత్ పిలుపునిచ్చారు.
అనంతరం ఏపీ ఐఎంఏ జాయింట్ సెక్రెటరీ డాక్టర్ రసిక్ సంఘ్వీ మాట్లాడుతూ
హరివిల్లు ఫౌండేషన్ లో నిలిపే నిరుపేదలైన వారికి ఇటువంటి సేవకురాలు చేయటమే
కాకుండా వృద్ధాశ్రమానికి డైపర్లు, బట్టలు,నిరాశ్రయులకు మూగ జీవాలకి ఆహారం
అందించడం వంటి పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు వారిని
అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గుండె వైద్య నిపుణులు పూర్ణచంద్,
చిన్నారి హాస్పటల్ డాక్టర్ దుర్గాప్రసాద్, ఇఎన్ టి స్పెషలిస్ట్ వై. జగన్మోహన్
రావు, హరివిల్లు ఫౌండేషన్ అధ్యక్షులు ఎన్ శశికాంత్, ఉపాధ్యక్షులు షేక్ రఫీ,
జాయింట్ సెక్రెటరీ యు. కనకారావు, కోశాధికారి ఎం. రవికుమార్ ఎం. ప్రసాద్
తదితర సభ్యులు పాల్గొన్నారు.