వెలగపూడి : రాష్ట్ర వార్షిక బడ్జెట్ రూ.2.6లక్షల కోట్లకుపైగా ఉండనుందని
ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం
ప్రారంభం కానున్నాయి. ఈ నెల 17న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టే చివరి
పూర్తి స్థాయి పద్దు ఇదే. ఎన్నికల నేపథ్యంలో వచ్చే ఏడాది ఓటాన్ అకౌంట్
పద్దుకే పరిమితం కావాల్సి ఉంటుంది. మంగళవారం ఉభయ సభలను(శాసనసభ, శాసనమండలి)
ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. ఈ నెల
25 లేదా 27వ తేదీతో ఈ సమావేశాలు ముగియనున్నాయి. మంగళవారం రాష్ట్ర మంత్రిమండలి
సమావేశం కానుంది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బిల్లులకు
ఆమోదం తెలపనుంది.