విజయవాడ : మహానేత అమలు చేసిన పథకాల బాటలో సాగాలన్న దృఢ సంకల్పంతో సీఎం వైఎస్
జగన్ మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్పార్టీని స్థాపించి నేటికి 13
సంవత్సరాలు. లక్ష్యాన్ని చేరుకోవటమే కాకుండా, అంతకు మించి ఆయన మరో నాలుగు
అడుగులు ముందుకు వేయటమే కనిపిస్తోందని వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి అన్నారు.
ఇది గ్రామ స్వరాజ్యం నుంచి జిల్లాల పునర్విభజన వరకు పరిపాలన సంస్కరణలు చేసిన
నాయకుడి పార్టీ. ఇది ప్రాంతాలకు న్యాయం కోసం వికేంద్రీకరణను సిద్ధాంతంగా
ఆచరిస్తున్న పార్టీ అన్నారు. ఇది తెలుగునాట మరో పారిశ్రామిక విప్లవానికి నంది
పలుకుతున్న దార్శనికుడి పార్టీ అని, మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్,
ఖురాన్గా భావించి 98.5 శాతం వాగ్దానాన్ని అమలు చేసిన నాయకుడి పార్టీ అని
స్పష్టం చేశారు.