అమరావతి : 12 ఏళ్ల ప్రస్థానంలో వైఎస్సార్సీపీ ప్రయాణం ఓ చరిత్ర అని టీటీడీ
చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. వైఎస్సార్ మరణంతో కుంగిపోయిన 570
కుటుంబాలను ఆదుకోవాలని తపనపడ్డారని, కాంగ్రెస్ పార్టీ కేసులు పెట్టినా
భయపడకుండా ప్రజల కోసం పాటుపడ్డారని, రెండేళ్లలో 67 మంది ఎమ్మెల్యేలు 9 మంది
ఎంపీలను గెలిపించుకున్న నాయకుడు సీఎం జగన్ అని పేర్కొన్నారు. టీడీపీ
ప్రలోభాలు, బెదిరింపులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినప్పడు మళ్లీ మెజార్టీతో
వస్తానని చెప్పి గెలిచిన నాయకుడు సీఎం జగన్ అని, గాంధీ కలలు కన్న గ్రామ
స్వరాజ్యం, అంబేడ్కర్ సామాజిక న్యాయం ఏపీలో ముఖ్యమంత్రి జగన్ అమలు చేసిన
చూపించారని చెప్పారు.