కడప : వైఎస్భాస్కర్ రెడ్డి ఆదివారం ఉదయం సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఈ
సందర్భంగా ఆఫీసులో అధికారులు లేకపోవడంతో భాస్కర్ రెడ్డి వెనుదిరిగారు. ఈ
సందర్భంగా భాస్కర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైఎస్ వివేకా కేసులో సీబీఐ
అధికారులు పిలిస్తే విచారణకు వచ్చాను. నాకు ఆరోగ్యం బాగాలేకపోయినా విచారణకు
హాజరయ్యాను. విచారణ అధికారి లేరు కాబట్టి తిరిగి మళ్లీ నోటీసులు ఇస్తామన్నారు.
నోటీసులు ఇచ్చిన తర్వాత మళ్లీ విచారణకు హాజరవుతాను. లెటర్ చూస్తే అసలు
విషయాలు బయటపడతాయి. కేసును పక్కదారి పట్టించొద్దు. ఈ కేసు పరిష్కారం కావాలంటే
లేఖను పరిశీలించాలని అన్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు
పై విచారణ తేదీని మళ్లీ తెలియజేస్తామని సీబీఐ అధికారులు చెప్పినట్లు ఎంపీ
అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి తెలిపారు. విచారణ కోసం ఆదివారం వచ్చిన
ఆయన సీబీఐ అధికారులు లేకపోవడంతో తిరిగి వెళ్లిపోయారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై సీబీఐ మరోసారి నోటీసులు
ఇస్తే విచారణకు హాజరవుతానని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తండ్రి
భాస్కర్‌రెడ్డి తెలిపారు. 12న విచారణకు రావాలంటూ ఆయనకు సీబీఐ నోటీసులు ఇచ్చిన
నేపథ్యంలో కడప కేంద్ర కారాగారం అతిథిగృహం వద్దకు ఆదివారం వచ్చారు. అక్కడ సీబీఐ
అధికారులు లేకపోవడంతో భాస్కర్‌రెడ్డి తిరిగి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా
భాస్కర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ విచారణ తేదీని మళ్లీ తెలియజేస్తామని
అధికారులు చెప్పినట్లు తెలిపారు. హత్య జరిగిన స్థలంలో లభ్యమైన లేఖపై సీబీఐ
ఎందుకు విచారణ చేపట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. అవినాష్‌రెడ్డితో పాటు
మిమ్మల్ని అదుపులోకి తీసుకుంటామంటూ సీబీఐ తరఫున న్యాయవాది తెలంగాణ హైకోర్టుకు
తెలియజేసిన అంశంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా తాము దేనికైనా సిద్ధమని
భాస్కర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. భాస్కర్‌రెడ్డిని సీబీఐ ఏడాది కిందట వరుసగా
రెండు రోజులపాటు పులివెందులలో విచారించింది. సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి
విచారణకు పిలిచింది. మరోవైపు భాస్కర్‌రెడ్డి రాకతో కడప జైలు వద్ద భారీగా
పోలీసులను మోహరించారు.