పెనుకొండ : పెనుకొండ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో వై.యస్.ఆర్ కాంగ్రెస్
పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని,పార్టీ జెండా ను
ఆవిష్కరించారు. పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు, నాయకులందరికీ
వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
మాజీ మంత్రి, శ్రీ సత్యసాయి జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,
పెనుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు మాలగుండ్ల శంకర నారాయణ కేక్ కట్ చేసిన అనంతరం
పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు పాలు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ
కార్యక్రమంలో పెనుకొండ పట్టణ, మండల ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు,
తదితరులు పాల్గొన్నారు.