విజయవాడ : శ్రీశైలం లోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం
ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాస్టర్ ప్లాన్ అమలుపై శనివారం
విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి, శ్రీశైలం
దేవస్థానం అధికారులు తదితరులతో ఆయన సమీక్షించారు. ప్రస్తుతం శ్రీశైలం
దేవస్థానం పరిధిలో ఉన్న సౌకర్యాలు, అందుబాటులో ఉన్న భూమి,ఇతర వివరాలను అడిగి
తెలుసుకున్నారు.స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఏవిధంగా
అభివృద్ధి చేయనుంది అందుకు అవసరమైన ప్రణాళికల వివరాలను పవర్ పాయింట్
ప్రజెంటేషన్ ద్వారా అధికారులు సిఎస్ కు వివరించారు. ఈసందర్భంగా ప్రభుత్వ
ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న
నిర్మాణాలు మాస్టర్ ప్లాన్ లో అభివృద్ధి చేయనున్న నిర్మాణాలు,రోడ్ల విస్తరణ,
సుందరీకరణ, తిరుమల తరహాలో మాడవీధుల ఏర్పాటు,క్యూలైన్లు ఏర్పాటుపై
చర్చించారు.వచ్చే సమావేశంలో విస్తృతంగా ఈఅంశాలపై చర్చిద్దామని ఆయా
ప్రతిపాదనలతో రావాలని అధికారులను సిఎస్ ఆదేశించారు.అంతేగాక ఈ మాస్టర్ ప్లాన్
అమలుకు అయ్యే ఖర్చు అంచనాలు సమర్పించాలని అన్నారు.అదే విధంగా శ్రీశైలం
సందర్శించే భక్తుల సంఖ్యకు అనుగుణంగా పూర్తి స్థాయిలో సౌకర్యాలు, వసతి
ఏర్పాట్లకు తగిన ప్రతి పాదనలను సిద్ధం చేసి రావాలని సిఎస్ స్పష్టం చేశారు.
ఈసమావేశంలో ముఖ్య కార్యదర్శి కె.సునీత, దేవాదాయశాఖ ఇన్చార్జి ముఖ్య
కార్యదర్శి, దేవాదాయశాఖ కమీషనర్ హరి జవహర్ లాల్, చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్,
దేవస్థానం ఇఓ సహా ఎస్.లవన్న,ఇఇలు రామకృష్ణ,దుర్గేశ్, ఇతర అధికారులు తదితరులు
పాల్గొన్నారు.