విజయవాడ : విజయవాడ రెవెన్యూ భవన్ లో శనివారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ
డ్రైవర్ల కేంద్ర సంఘం ఎన్నికల ప్రక్రియ జరిగినది. ప్రభుత్వ సలహాను అనుసరించి
గతంలో ఉన్న విభేదాల విస్మరించి, ఎపి జెఏసి అమరావతి చైర్మన్ బొప్పరాజు
వెంకటేశ్వర్లు అధ్వర్యంలో గతంలో అధ్యక్షులుగా వ్యవహరించిన డిఎస్ కొండయ్య,
సంసాని శ్రీనివాసరావులు సారథ్యం వహిస్తున్న అన్ని జిల్లాల కార్యవర్గ సభ్యులు
ఐక్యంగా ఉండాలని అంగీకరించి అందరూ కలసి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నిక
నిర్వహించుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఆ తీర్మానం మేరకు ఈ ఎన్నికల
నిర్వహణకు గాను కో ఆపరేటివ్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు టి.వి.ఫణి
పేర్రాజుని ఎన్నికల అధికారిగా నియమించుకొన్నారు. ఈ ఎన్నికలలో రాష్ట్ర అధ్యక్ష
స్థానానికి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షడు కాకినాడకు చెందిన సంసాని
శ్రీనివాసరావు పేరును మాజీ అధ్యక్షులు డిఎస్ కొండయ్య ప్రతిపాదిస్తూ నామినేషన్
సమర్పించగా, ఇతర నామిషన్ ఏవీ దాఖలు కానందున సంసాని శ్రీనివాస రావును
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డ్రైవర్ల కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా
ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షులు గా
ఏకగ్రీవంగా ఎన్నికైన సంసాని శ్రీనివాసరావుని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్
బొప్పరాజు వెంకటేశ్వర్లు అభినందిస్తూ ఇప్పటికే సంసాని శ్రీనివాస రావు
ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కో – చైర్మన్ గా ఉన్నారని, ఈ రోజు తిరిగి ఎంతో
చరిత్ర ఉన్న అంధ్రప్రదేశ్ ప్రభుత్వ డ్రైవర్ల సంఘానికి తిరిగి మళ్ళీ అన్ని
జిల్లాలు, వర్గాలు కలిసి ఏకతాటిపై నిలబడి ఎన్నికలు నిర్వహించుకోవడం చాలా
సంతోషం విషయమని భవిష్యత్తులో డ్రైవర్ల సంఘం సమస్యల పరిష్కారానికి మా సహకారం
ఎప్పుడూ అందిస్తామని తెలియచేశారు. అధ్యక్షుడుగా ఎన్నికైన సంసాని శ్రీనివాసరావు
మాట్లాడుతూ ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు సహకారంతో
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాహనముల డ్రైవర్ల కేంద్ర సంఘం తరపున ప్రభుత్వ
డ్రైవర్లకు ఉన్న సమస్యలన్నీ పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తానని
తెలియజేశారు. ఏపీజేఏసీ అమరావతి ఇచ్చిన ఉద్యమ కార్యాచరణలో మా ప్రభుత్వ
డ్రైవర్ల సంఘం పాల్గొని మా ఉద్యమ కార్యాచరణ ముందుండి నడిపిస్తామని అన్నారు.