విశాఖపట్నం : టీడీపీ మద్దతుతో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేపాడ
చిరంజీవిరావుకు తొలి ప్రాధాన్య ఓటు వేసి గెలిపించాలని తెలుగు మహిళ రాష్ట్ర
అధ్యక్షురాలు వంగలపూడి అనిత కోరారు. నిరుద్యోగులు, ఉద్యోగులకు న్యాయం జరగాలంటే
చిరంజీవిరావును శాసనమండలికి పంపాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల పేట నియోజకవర్గ
పరిశీలకురాలు, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో కలిసి కోటవురట్ల మండలం
రాట్నాలపాలెం, రాజుపేటలో ప్రచారం నిర్వహించారు. ఓటర్లకు నమూనా బ్యాలెట్
పత్రాలు పంచారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు, మండల
అధ్యక్షుడు జానకి శ్రీను, నాయకులు కొప్పిశెట్టి వెంకటేష్, వెంకటరాజు, బాబ్జీ,
జనార్దన్, లింగన్ననాయుడు తదితరులు పాల్గొన్నారు.