పెనుకొండ : వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ
అభ్యర్ధులను మీ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటుతో ఆశీర్వదించాలని మాజీ మంత్రి,
శ్రీ సత్యసాయి జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పెనుకొండ
నియోజకవర్గ శాసనసభ్యులు మాలగుండ్ల శంకర నారాయణ విజ్ఞప్తి చేశారు. పెనుకొండ
లో ఈ నెల 13వ తేదీ జరుగు పట్టభద్రుల, పాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో
భాగంగా గురువారం పెనుకొండ కోర్టు బారు రూంలో లాయర్లతో ప్రచార కార్యక్రమం
నిర్వహించి, ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో పోటీ
చేయుచున్న పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ వై.యస్.ఆర్ కాంగ్రెస్
పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధి వెన్నపూస రవీంద్రారెడ్డి కి మీ అమూల్యమైన మొదటి
ప్రాధాన్యత ఓటు వేసి వేయించి అఖండమైన మెజారిటీతో గెలిపించాలని కోరిన మాజీ
మంత్రి, శ్రీ సత్యసాయి జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,
పెనుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు మాలగుండ్ల శంకర నారాయణ కోరారు. ఈ
కార్యక్రమంలో పెనుకొండ పట్టణ, మండల ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు,
తదితరులు పాల్గొన్నారు.