వెలగపూడి : సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పోస్టుల భర్తీకి ఏపీ హైకోర్టు
దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హులైన వారు మార్చి 17 నుంచి దరఖాస్తులు
చేసుకోవచ్చు. న్యాయశాఖలో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి ఏపీ హైకోర్టు
నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 30 సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్)
పోస్టుల భర్తీకి అమరావతిలోని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం దరఖాస్తులు
ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 17 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు
ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని హైకోర్టు రిజిస్ట్రార్
(రిక్రూట్మెంట్) ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఉద్యోగాల్లో డైరెక్ట్
రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 24 ఖాళీలు, బదిలీల ద్వారా మరో 6 ఖాళీల్ని భర్తీ
చేయనున్నట్టు పేర్కొన్నారు.నోటిఫికేషన్లో ముఖ్యాంశాలు : మొత్తం పోస్టుల సంఖ్య: 30, అర్హత :
న్యాయశాస్త్రంలో బ్యాచిలర్స్ డిగ్రీ తప్పనిసరి. వయోపరిమితి: 01-03-2023
నాటికి 35 ఏళ్లు మించరాదు. వేతనం: రూ.77,840 – రూ.1,36,520. ఎంపిక ప్రక్రియ:
స్క్రీనింగ్ టెస్ట్ (కంప్యూటర్ ఆధారిత స్క్రీనింగ్ టెస్ట్), రాత పరీక్ష,
మౌఖిక పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన. స్క్రీనింగ్పరీక్ష ఫలితాలు వెల్లడించిన
తర్వాత రాత పరీక్షనిర్వహిస్తారు. అప్లికేషన్ ఫీజు: ఓపెన్
కేటగిరీ/ఈడబ్ల్యూఎస్/బీసీ కేటగిరీకి చెందిన అభ్యర్థులు రూ.1500 చెల్లించాలి.
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులైతే రూ.750లు చెల్లిస్తే సరిపోతుంది.
స్క్రీనింగ్ టెస్ట్ సెంటర్లు: గుంటూరు, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి,
విజయవాడ, విశాఖపట్నం. అభ్యర్థులు ఏవైనా మూడు కేంద్రాలను ప్రాధాన్యతల వారీగా
ఆప్షన్ పెట్టుకోవచ్చు.

ఇవి గుర్తు పెట్టుకోండి : ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: మార్చి 17 నుంచి
దరఖాస్తులకు తుది గడువు : ఏప్రిల్ 6. స్క్రీనింగ్ టెస్ట్ హాల్ టిక్కెట్ల
డౌన్లోడ్: ఏప్రిల్ 15. కంప్యూటర్ ఆధారిత స్క్రీనింగ్ టెస్ట్: ఏప్రిల్
24 (ఉదయం 8.30గంటల నుంచి 10.30గంటలవరకు). ప్రిలిమినరీ కీ/అభ్యంతరాల స్వీకరణ :
ఏప్రిల్ 27.