విజయవాడ : సమాజంలో మంచి చెడులు విడమర్చి ప్రభుత్వం దృష్టికి తీసుకెల్లే
విలేకరులు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ మినీ జనరల్ ఆసుపత్రిలో
బాలింతలు, గర్భిణీ స్త్రీలకు పండ్లు బన్ రొట్టెలు పంపిణీ చేయడం హర్షనీయమని
షేక్ రాజా సాహెబ్ ప్రభుత్వ మినీ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్
వాణిశ్రీ అన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంద్రప్రదేశ్ మీడియా
ప్రొపెషనల్స్ అసోసియేషన్ విజయవాడ నగర శాఖ ఆధ్వర్యంలో బుధవారం విజయవాడ పశ్చిమ
నియోజకవర్గ పరిధిలోని కొత్తపేట షేక్ రాజా సాహెబ్ (ప్రసూతి)మినీ జనరల్
ఆసుపత్రిలోని బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు బన్ రొట్టెలు, చక్కెర కేళి పండ్లు
పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యకమాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్
డాక్టర్ వణిశ్రీ చేతులు మీదుగా ప్రారంభించారు.ఈ సందర్భంగా వాణిశ్రీ విలేకరుల
సేవలను కొనియాడారు. అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సీనియర్
జర్నలిస్టు.యేమినేని వెంకటరమణ మాట్లాడుతూ ఆసుపత్రిలో వైద్యులకు,నర్సులు,
బాలింతలు, గర్భిణీ స్త్రీలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు
తెలిపారు. అసోసియేషన్ నగర శాఖ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు టి అనిల్ కుమార్,
గుర్రం శ్రీనివాసరావు లు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా మహిళల ప్రాధాన్యత,
గూర్చి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రిలోని డాక్టర్లు సాయిరామ్, అర్బన్
ప్రైమరీ హెల్త్ సెంటర్ వైద్యులు శ్రీనివాసరాజు,టి బి హెల్త్ విజిటర్ లలిత
కుమారి,హెడ్ నర్సు రాజసులోచన, నవమల్లెతీగ సాహిత్య మాసపత్రిక సంపాదకులు
కలిమిశ్రీ, సీనియర్ సబ్ ఎడిటర్ సి హెచ్ రాఘవేంద్ర శేఖర్, ఏపీఎంపీఏ
ఉపాధ్యక్షులు వేల్పుల ప్రశాంత్, కార్యవర్గ సభ్యులు పిల్లా ఆనంద్, సభ్యులు
నాగోతి శ్రీనివాసరావు,టి ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు.