మంగళగిరి : మహిళల రక్షణ కోసమే దిశ పోలీసు స్టేషన్లు, దిశ యాప్ అందుబాటులోకి
తీసుకొచ్చినట్లు డీజీపీ రాజేంద్రనాథరెడ్డి పేర్కొన్నారు. మహిళా దినోత్సవ
సందర్భంగా మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన
మాట్లాడుతూ మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. మహిళా కానిస్టేబుల్
వ్యవస్థ ద్వారా క్షేత్రస్థాయిలో మంచి ఫలితాలు వస్తున్నాయి. నిందితుల
గుర్తింపులో వారు కీలకంగా ఉన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో మహిళలపై జరుగుతున్న
వేధింపులపై ముందస్తు సమాచారం పోలీసు స్టేషన్లకు అందటంతో నేరాల నియంత్రణ
సాధ్యమైందని పేర్కొన్నారు.