యువనాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్యను వైఎసార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్
జగన్మోహనరెడ్డి నియమించారు. ఈ సందర్భంగా యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ
చైతన్యను జిల్లా వైఎసార్సీపీ అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్
పార్టీ ముఖ్య శ్రేణులతో కలిసి అభినందించారు. గతంలో రాష్ట్ర బిసీ సెల్
అధ్యక్షునిగా ధర్మాన కృష్ణదాస్ బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన తనయుడు
కృష్ణ చైతన్య శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల
ఇంచార్జ్ గా బాధ్యతలు నిర్వహిస్తారు. వైద్య విద్యలో పీజీ పూర్తి చేసిన ఆయన
తండ్రి రాజకీయ వారసునిగా ఇప్పటికే గుర్తింపు పొందారు. పోలాకి జడ్పిటిసిగా
బాధ్యతలు నిర్వర్తిస్తూ, నరసన్నపేట నియోజకవర్గ రాజకీయ వ్యవహారాలను కూడా ఆయన
పర్యవేక్షిస్తున్నారు.బీసీల పార్టీ వైయస్సార్సీపి : కృష్ణ చైతన్యబీసీల డిక్లరేషన్ లోని ప్రతి అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు
చేసిందని ఈ మూడున్నరేళ్లలో బీసీలకు ఎంతో మేలు చేకూర్చుందని బీసీ సెల్ జోనల్
ఇన్చార్జి డాక్టర్ ధర్మాన చైతన్య చెప్పారు. నరసన్నపేట పార్టీ కార్యాలయంలో ఆయన
విలేకరులతో మాట్లాడుతూ జోనల్ ఇన్చార్జిగా తనను నియమించిన ముఖ్యమంత్రి వైయస్
జగన్మోహన్ రెడ్డికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. గతంలో తన తండ్రి రాష్ట్ర
బీసీ సెల్ ఇంచార్జిగా నిర్వర్తించిన బాధ్యతలు, అనుభవం తనకు ఎంతగానో ఉపయోగ
పడతాయన్నారు. తనకు అప్పగించిన బాధ్యతల నిర్వహణ పట్ల ఎంతో చిత్త శుద్ధితో
ఉన్నానని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీల పార్టీ అని కృష్ణ చైతన్య
పేర్కొన్నారు.
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కృష్ణ దాస్
నరసన్నపేట : మహిళాభ్యున్నతికి అంకితమైన సీఎం జగన్మోహన రెడ్డి పాలనలో వారికి మరింత మేలు జరుగుతోందని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భగా ఆయన మహిళా మణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మహిళకు మంచి చేయడం కోసం సీఎం జగన్ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తున్నారని, రాజకీయ నియామకాల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేశారన్నారు. మహిళలకు 51 శాతం పదవులు కేటాయించాలని చట్టం చేసిన తొలి ప్రభుత్వం మనదేనని అన్నారు. జడ్పీ ఛైర్ పర్సన్లుగా 54శాతం మంది, మున్సిపల్ ఛైర్పర్సన్లుగా 64 శాతం మంది మహిళలే ఉన్నారని పేర్కొన్నారు.