కొవ్వూరు : రాష్ట్ర చరిత్రలో విశాఖపట్నం లో గ్లోబల్ సమ్మిట్ ఒక చారిత్రక ఘట్టం
అని రాష్ట్ర హోం మంత్రి డా తానేటి వనిత అన్నారు. మంత్రి క్యాంపు
కార్యాలయంలో వైయస్ఆర్ సీపీ పార్టీ శ్రేణులతో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ
సందర్భంగా వైయస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రూ. 3
లక్షల కోట్ల పెట్టుబడులు , 20 రంగాలలో తద్వారా ఆరు లక్షల మందికి పైగా యువతకు
ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ఇవన్నీ కేవలం జగనన్న వలనే సాధ్యం అన్నారు.
మన రాష్ట్ర పరిస్థితిని వివరించి, ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి కారణం
వివరిస్తూ జగనన్న పెద్ద ఎత్తున బడాబాడా పారిశ్రామిక వేత్తలను విశాఖ సమ్మిట్ కు
ఆహ్వానించడం జరిగిందన్నారు. జగనన్న పై నమ్మకం దిగ్గజాలు కదలిరావడం
జరిగిందన్నారు. ప్రతిపక్ష నేత గా ఉన్న జగన్ మోహన్ రెడ్డిని విశాఖ పట్నం లో
అడుగు పెట్టకుండా ఆనాటి ప్రభుత్వం ఎయిర్ పోర్ట్ లోనే నిర్బంధించిన ఘటన
చోటుచేసు కుందన్నారు. విజయమ్మ విశాఖ నుంచి ఎంపి గా పోటీ చేసిన సమయంలో కడప
రెడ్లు ఇక్కడికి వస్తున్నరని, ఈ ప్రాంతం రెడ్ల పాలనతో అశాంతి అభద్రతల కు నిలయం
అవుతాయని అసత్య ప్రచారం చేశారని అన్నారు. అయితే అదే విశాఖపట్నం లో పెద్ద
ఎత్తున నేడు పారిశ్రామిక దిగ్గజాలు కదిలి వొచ్చి చెంప పెట్టు గా ప్రతిపక్షాలకు
జగనన్న సమాధానం చెప్పారని తెలిపారు.
13 లక్షల కోట్ల పెట్టుబడులతో 20 రంగాలలో తరలి రానున్న పరిశ్రమలు, తద్వారా
ఆరు లక్షల మందికి పైగా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో
జగనన్న పారిశ్రామిక వేత్తలను ఆకట్టుకోవడం జరిగిందన్నారు. రాష్ట్రంలో అమలు
అవుతున్న పారిశ్రామిక రంగం లో పెట్టుబడులు, అందచేస్తున్న చేయూత, ప్రోత్సాహం,
పాలసీలు అద్దం పడుతున్నా యన్నారు. నేడు ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకెళ్లాలని
మంత్రి తెలిపారు. రానున్న రోజుల్లో రాష్ట్ర ఆర్థికంగా మరింత బలోపేతం కావడం
తథ్యం అన్నారు. తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ, పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు
అమలు చేస్తూ నేడు పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు
చేస్తున్న జగనన్న పాలన లో తనదైన ముద్ర వేస్తున్నట్లు తెలిపారు. పేదరికం దూరం
చెయ్యాలనే సంకల్పం తో సంక్షేమ పథకాలు అమలు చేయడం తపన జగనన్న కు ఉందన్నారు.
ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి అనే గౌరవం లేకుండా మాట్లాడడం జరుగుతోందని అన్నారు.
అయినా సరే నిబ్బరం కోల్పోకుండా సహనంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి
వ్యవహరిస్తున్నారని అన్నారు.