విజయవాడ : పార్లమెంట్లో 33 శాతం మహిళా బిల్లు రిజర్వేషన్ కోసం పోరాడుతుంటే
రాష్ట్రంలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్
రెడ్డిదే అని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. మంగళవారం
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
సందర్భంగా నిర్వహించిన మహిళా సాధికారత, సమానత్వం అంశంపై మహిళా కమిషన్ ఛైర్
పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ రాష్ట్రాన్ని మహిళాంధ్రప్రదేశ్ గా
ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మార్చారని అన్నారు. మహిళల కోసం సమస్త
యంత్రాంగం, సమస్త వ్యవస్థ పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో మహిళను నిర్ణయాత్మక
శక్తిగా తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రిదన్నారు.
అడగకుండానే అన్నింట్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించారన్నారు. మహిళలకు
నామినేటెడ్ పదవుల్లో, కాంట్రాక్టు వర్కుల్లో 50శాతంరిజర్వేషన్ నామినేటెడ్
పోస్టులు చైర్మన్లు 50శాతం , డైరెక్టర్లు 51శాతంలోకల్ బాడీస్ (అర్బన్)
మున్సిపల్ కార్పోరేషన్స్ మేయర్లు, డిప్యూటీ మేయర్లు 50శాతం , వార్డ్ మెంబర్లు
53శాతం మున్సిపాలిటీస్ లో చైర్ పర్సన్ లు 60శాతం, వార్డ్ మెంబర్లు
54.69శాతం, సర్పంచులు 56.97శాతం , ఎంపీటీసీలు 54.30శాతం , జడ్పీటీసీలు
52.80శాతం , ఎంపీపీ- 53శాతం, జడ్పీ చైర్మన్లు 53.85శాతం, వైస్ చైర్మన్ లు
53.85శాతం, ఏఎంసీ- 49శాతం , వాలంటీర్లు 53శాతం మహిళా సంక్షేమం కోసం ఎంతైనా
చేయాలన్న తపన ముఖ్యమంత్రికి ఉందన్నారు. ప్రతి మహిళ జీవితంలో మార్పు రావాలన్నదే
ఆయన లక్ష్యమన్నారు. అన్ని రంగాల్లో మహిళలు అభివృద్ధి సాధించినప్పుడే మహిళా
సాధికారత సాధ్యమవుతుందన్న వాసిరెడ్డి పద్మ మహిళా సాధికారత సాధన కోసం
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వినూత్న పథకాలు ప్రవేశపెట్టారన్నారు.
మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు అవసరమైన తోడ్పాటు, ఆర్థిక చేయూతను ఈ
పథకాల ద్వారా అందజేస్తున్నారన్నారు. దిశ యాప్ ద్వారా మహిళలకు భద్రత కల్పిస్తూ,
గ్రామ సచివాలయాల్లో పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేసి ముఖ్యమం అక్కచెల్లెమ్మలకు
అభయ హస్తమందిస్తున్నారని తెలిపారు. మహిళలపై ఏ చిన్న అఘాయిత్యం జరిగినా 21
రోజుల్లోనే వేగవంతమైన దర్యాప్తు చేసి నేరస్తులను పట్టుకొని శిక్షలు
విధిస్తోన్న ప్రభుత్వం తమదేనన్నారు. ప్రస్తుతం మహిళను శక్తిగా గుర్తించే
పరిస్థితి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చారని చెప్పారు.
మనసా, వాచా, కర్మనః ముఖ్యమంత్రి వేస్తున్న ప్రతి అడుగూ మహిళ అభ్యున్నతి
కోసమేనన్నారు. మహిళల కోసం ఇంతగా చేస్తున్న ప్రభుత్వం ఉంది కాబట్టి
ఆంధ్రప్రదేశ్ లో ప్రతి రోజూ మహిళా దినోత్సవమే అన్నారు. అనంతరం రాష్ట్ర వైద్య,
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విడదల రజని, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఎస్పీ
కె.జి.వి సరిత, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్
చల్లపల్లి స్వరూపరాణి, మార్పు ట్రస్ట్ డైరెక్టర్ రావూరి సూయిజ్, మీడియా
అడ్వైసర్ కమిటీ సభ్యురాలు, జర్నలిస్టు రెహానా బేగం తదితరులు
ప్రసంగించారు.కార్యక్రమంలో సెర్ప్, మెప్మా అధికారులు, సిబ్బంది, అన్ని జిల్లాల
నుండి వచ్చిన డ్వాక్రా మహిళలు, తదితరులు పాల్గొన్నారు.