హైదరాబాద్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని వివిధ రంగాల్లో
మెరుగైన సేవలు అందించిన వనితలకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది.
మొత్తం 27మంది మహిళలను ఈ అవార్డులకు ఎంపిక చేయగా వీరికి లక్ష రూపాయల నగదును
బహుమతిగా ఇవ్వనున్నారు. ఈ మేరకు మహిళ శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ
చేసింది. వివిధ రంగాల్లో మెరుగైన సేవలు అందించిన మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అవార్డులను ప్రకటించింది. 2023
సంవత్సరానికిగాను మొత్తం 27 మందిని అవార్డులకు ఎంపిక చేశారు. అవార్డులు పొందిన
వారికి లక్ష రూపాయల నగదు పురస్కారంతో పాటుగా వారికి ప్రభుత్వం తరుపున సన్మాన
కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు మహిళా, శిశు సంక్షేమశాఖ ఉత్తర్వులు
జారీ చేసింది. అవార్డు పొందిన వారిలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన
ముఖ్రాకే గ్రామ సర్పంచ్ మీనాక్షి గాడ్గే, ఐపీఎస్ అధికారి అనసూయ, అంగన్ వాడీ
టీచర్ బానోతు జ్యోతి, మౌంటెనీర్ అన్వితా రెడ్డి, మహిళా క్రికెటర్ గొంగడి
త్రిష, ఆశా వర్కర్ కృష్ణవేణి, ఏఎన్ఎం ఇందిర, ఉమెన్ ఎంటర్పెన్యూర్ సమంతా
రెడ్డి, షీ టీమ్స్ ఇన్స్పెక్టర్ రుక్మిణి, పేట్లబుర్జు ఆసుపత్రి
సూపరింటెండెంట్ మాలతి తదితరులు ఉన్నారు. మహిళా దినోత్సవం పురస్కరించుకొని
రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులకు మార్చి 8న సర్కార్ సెలవు ప్రకటించింది. ఈ మేరకు
రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులకు సాధారణ సెలవు ప్రకటిస్తూ.. ప్రభుత్వ సీఎస్
శాంతి కుమారి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు మహిళా దినోత్సవం
సందర్భంగా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వనున్నట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి
హరీశ్‌రావు తెలిపారు. సెర్ప్, మెప్మా మహిళలకు ఈ రుణాలను అందిస్తామని
పేర్కొన్నారు. వీటికి సంబంధించి ఈనెల 8న రూ.750 కోట్లు రుణాలను విడుదల
చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు.