విజయవాడ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వంటి విజనరీ లీడర్ దేశంలోనే
మరొకరు లేరని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది
విష్ణు అన్నారు. మంగళవారం 64 వ డివిజన్ 285 వ వార్డు సచివాలయ పరిధిలో
నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు
శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ యరగొర్ల తిరుపతమ్మతో కలిసి ఆయన
హాజరయ్యారు. కండ్రిక, ఎన్.ఎస్.సి.బోస్ నగర్, ఎన్జీవో కాలనీలలో విస్తృతంగా
పర్యటించి 331 గడపలను సందర్శించారు. ఎక్కడకు వెళ్లినా, ఏ కుటుంబం
తలుపుతట్టినా.. సంక్షేమ పథకాలు అందుతున్నాయనే ప్రజలు చెబుతున్నారని మల్లాది
విష్ణు అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డినే మరోసారి తమ ముఖ్యమంత్రి కావాలని
ప్రజలు బలంగా కోరుకుంటున్నారని తెలిపారు.
సంక్షేమంలో అగ్రగామి
పేద ప్రజలకు సంక్షేమం అందించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా
ఉందని మల్లాది విష్ణు తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారు లంకలపల్లి కమల
మాట్లాడుతూ.. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం తనకు పునర్జన్మను ప్రసాదించిందని
చెప్పారు. హృద్రోగంతో బాధపడుతున్న ఆమెకు జగనన్న ప్రభుత్వం అండగా నిలిచి
ఆదుకుందన్నారు. తోట రాజేశ్వరి మాట్లాడుతూ.. వైఎస్సార్ కాపునేస్తం, రైతుభరోసా,
ఆసరా, సున్నావడ్డీ, పింఛన్ కానుక పథకాలు వర్తిస్తున్నట్లు చెప్పారు. మరో
లబ్ధిదారు తోట లక్ష్మీ కాంతమ్మ మాట్లాడుతూ.. తన కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ
కార్యక్రమాల ద్వారా రూ. 9.19 లక్షల లబ్ధి చేకూరిందని తెలిపారు. రాష్ట్రంలోని
ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఏదో ఒక పథకం రూపంలో చేకూరుతున్న మేలును చూసి
జీర్ణించుకోలేక ప్రతిపక్షాలన్నీ కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని మల్లాది విష్ణు
విమర్శించారు.
మహిళల తలరాతను మార్చేలా పథకాలు
రాష్ట్ర ప్రగతికి మహిళలే మూల స్తంభాలని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది
విష్ణు అన్నారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని
ఎన్.ఎస్.సి.బోస్ నగర్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గ
అక్కచెల్లెమ్మలకు ఆయన ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళలను
గౌరవించటం మన సంప్రదాయమని.. కుటుంబంలో ప్రేమ బాంధవ్యాలు పెంపొందించటంలో,
మెరుగైన సమాజం సృష్టించటంలో మహిళల సేవ ఎనలేనిదని కొనియాడారు.కార్యక్రమంలో
డీఈలు గురునాథం, రామకృష్ణ, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరారవు, నాయకులు యరగొర్ల
శ్రీరాములు, ఎస్.కె.ఇస్మాయిల్, జిల్లెల్ల శివ, మేడా రమేష్, పందిరి వాసు,
కొక్కిలిగడ్డ నాని, తాండవ కోటి, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది
పాల్గొన్నారు.