విశాఖపట్నం : ఉద్యోగ సంఘాలకు, ప్రభుత్వానికి మధ్య వార్ నడుస్తూనే ఉంది.
సమస్యలను పరిష్కరించాలని, సీపీఎస్ ను అమలు చేయాలంటూ చాలా రోజులుగా ఉద్యోగ
సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో
ఉద్యోగ సంఘాలు ఉద్యమబాట పట్టాయి. ఈనెల 9 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు
చేస్తున్నట్లు ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు
ప్రకటించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్ట్ ,
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆర్ధిక, ఆర్ధికేతర సమస్యలను నాలుగేళ్లుగా జగన్
ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఆంధ్రప్రధేశ్ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక,
రిటైర్డు కాంట్రాక్టు & ఔట్ సోర్శింగు ఉద్యోగుల దీర్ఘకాలిక ఆర్ధిక, ఆర్ధికేతర
సమస్యల పరిష్కార కొరకు ఎపిజెఏసి అమరావతి రాష్ట్రకార్యవర్గంలో తీసుకున్న
నిర్ణయం మేరకు ఈనెల 9 నుండి ఏఫ్రిల్ 3 వరకు ఉద్యమ కార్యచరణ ప్రకటించామని
ఏపిజెఏసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటెేశ్వర్లు, స్టేట్ జనరల్
సెక్రటరీ పలిశెట్టి దామోదరరావు తెలిపారు. సోమవారం విశాఖపట్నం రెవిన్యూభవన్ లో
ఈనెల 9 నుండి చేపట్ట బోతున్న ఉద్యమానికి ఉద్యోగులను సన్నద్దం చేసేందుకు
ఏర్పాటు చేసిన సమావేశం విశాఖపట్నం ఏపిజెఏసి అమరావతి చైర్మన్ సత్తి నాగేశ్వర
రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న చైర్మన్
బొప్పరాజు వెంకటెేశ్వర్లు మాట్లాడుతూ ఉద్యోగుల జీతభత్యాలు చెల్లించేందుకు
బడ్జెట్ కేటాయింపులు చేస్తే ఎందుకు మా జీతాలు, పెన్షలు గత రెండు సంవత్సరాలుగా
సకాలంలో ఒకటవ తేదీన ప్రభుత్వం చెల్లించలేక పోతున్నారో తెలియడం లేదు. నిజంగా మా
నిధులు మాకు కేటాయించి ఉంటే మాకు రావల్సిన డిఏ బకాయిలు, పీ ఆర్ సి బకాయిలు,
రావల్సిన కొత్త డిఏ లు, సరెండర్ లీవులు, ఎర్నేడ్ లీవులు, తదితర చట్టబద్దంగా
రావాల్సిన కోట్లాది రూపాయల బిల్లులు ఎందుకు సకాలంలో ఇవ్వడము లేదో ప్రభుత్వం
తెలపాలి అన్నారు. అలాగే ఉద్యోగులు దాచుకున్న షుమారు 3000కోట్ల జీ పీ ఎఫ్
డబ్బులు కూడా ఉద్యోగుల కుటుంబ అవసరాలకు ఎందుకు చెల్లించడం లేదు.
ముఖ్యమంత్రి ఇచ్చిన హామీమేరకు వారం రోజులలోనే సీపీఎస్ ను రద్దుచేసి ఓపీఎస్
పునరుద్దరిస్తామని ఇచ్చిన హామి అమలు చేయాలని ఒకవైపు మేము పోరాటాలు చేస్తుంటే
ప్రభుత్వపెద్దల మరోవైపు సీపీఎస్ రద్దుపై సమాదానం చెప్పకుండా, సీపీఎస్ పై
అవగాహాన లేక, ఓపీఎస్ కు బదులుగా జీపీఎస్ ను ప్రవేశపెడుతామని చెప్పడం ఎంతవరకు
బావ్యమో ప్రభుత్వమే ఆలొచించాలని, ఈ జీపీఎస్ ప్రతిపాధనలను ఎట్టిపరిస్దితులలోను
ఒప్పు కొనేపరిస్దితి లేదని ఇప్పటికే ఏపిజెఏసి అమరావతి పక్షాన ప్రభుత్వానికి
స్పష్టం చేసామన్నారు.