విశాఖపట్నం : వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో మంగళవారం అంతర్జాతీయ మహిళా
దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు
ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు తెలిపారు. ఈ మేరకు సోమవారం డాబాగార్డెన్స్
విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో మహిళా దినోత్సవం నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై
కార్యవర్గ సభ్యులతో చర్చించారు. అనంతరం శ్రీనుబాబు పాత్రికేయులతో మాట్లాడుతూ
మంగళవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి డాబాగార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో ఆయా
కార్యక్రమాలు ప్రారంభమవుతాయి అన్నారు. ఈ సందర్భంగా తొలుత సాంస్కృతిక
కార్యక్రమాలు నిర్వహణ ఉంటుందన్నారు. స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ విద్యార్థులతో
పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. అనంతరం అతిధులు చేతుల మీదుగా వివిధ
రంగాల్లో సేవలు అందిస్తున్న మహిళా జర్నలిస్టులను, ఇతర ప్రముఖులను ఘనంగా
సత్కరించుకోవడం జరుగుతుంది అన్నారు. కావున జర్నలిస్టు మిత్రులందరు
కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని శ్రీను బాబు కోరారు. ఈ సమావేశంలో ఫోరం
కార్యదర్శి దాడి రవికుమార్ , ప్రోగ్రాం కోఆర్డినేటర్, వైస్ ప్రెసిడెంట్ ఆర్
నాగరాజు పట్నాయక్ సహాయ కోఆర్డినేటర్ పి వరలక్ష్మి, కార్యవర్గ సభ్యులు ఇరోతు
ఈశ్వర రావు, ఎమ్మెస్సార్ ప్రసాద్ డి గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.