విజయవాడ : ప్రత్యేక హోదా కోసం ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు మరికొన్ని పార్టీలను
కలుపుకొని జాయింట్ యాక్షన్ కమిటీని నియమించామని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు
ఫణిరాజ్ పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ, ఇండియా జైహింద్ పార్టీ ఆధ్వర్యంలో
స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో శనివారంఅఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ
సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి జిల్లాలో కమిటీలు ఏర్పాటు చేసి రాష్ట్ర
వ్యాప్తంగా విస్తరిస్తున్నామని, తెలియజేశారు. ప్రత్యేక హోదా రాష్ట్ర హక్కు అని
ఈ కమిటీ ద్వారా ప్రజలకు తెలియపరుస్తామని ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామని ఆయన
అన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక హోదా, ఉమ్మడి కార్యచరణ
సంఘము జేఏసీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నేతలు మాట్లాడుతూ ఆంధ్ర
ప్రదేశ్ రాష్ట్రానికి విభజన అనంతరం కేంద్ర ఆర్థిక సహాయ నిమిత్తం ప్రత్యేక హోదా
కల్పిస్తామని అన్ని 13 జిల్లాలకు వర్తింపచేస్తామని హామీ ఇచ్చి విస్మరించారని
చెప్పారు. ప్రత్యేక హోదా కావాలని గత ఏడు సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నా
ఎందుకు పోరాటం చేస్తున్నామో ప్రజలకు తెలియాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.
ప్రత్యేక హోదా గురించి కేంద్ర, అధికార, ప్రతిపక్షాలు నోరుమెదపడం లేదని
ప్రత్యేక హోదా వస్తే యువత భవిష్యత్తు బాగుంటుందని చెప్పే ఏ ఒక్క రాజకీయ పార్టీ
కూడా లేదని అన్నారు. ఈ తరుణంలో ఆప్ పార్టీతో పాటు కొన్ని పార్టీలు ముందుకు
వచ్చి పోరాడుతామని చెప్పాయని అందుకే జాయింట్ యాక్షన్ కమిటీ ని ఏర్పాటు చేసి
రాష్ట్రవ్యాప్తంగా విస్తృతపరుస్తున్నామని తెలియజేశారు. జిల్లాలో కమిటీలు
ఏర్పాటు చేశామని అందర్నీ ఒకే తాటి మీద తీసుకొస్తామని తెలిపారు. ఈ జేఏసీ కమిటీ
ద్వారా రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదా గురించి తెలియజేస్తామని పేర్కొన్నారు.
సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నాయకులు ఫణి రాజ్, బీసీ జాతీయ సంఘం నగర
మహిళా అధ్యక్షురాలు ఎం. జ్యోతి, బిఆర్ఎస్ నాయకులు కొణిజేటి ఆదినారాయణ,
అఖిలపక్షం చైర్మన్ చింతా రాజశేఖర్, బేతు రామమోహన్, దశరధరమిరెడ్డి, రాజా
శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. తదితరులు పాల్గొన్నారు.