విజయవాడ : ఎన్టీఆర్ జిల్లా వక్స్ బోర్డు చైర్మన్ గా విజయవాడకు చెందిన షేక్
గౌస్ మొహిద్దిన్ నియమితులయ్యారు. పశ్చిమ శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు
ఎన్టీఆర్ జిల్లా వకో బోర్డు చైర్మన్ గా గౌస్ మొహిద్దీన్ ను నియమించాలని కోరుతూ
ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి గతంలో సిఫార్సుచేయడం జరిగింది. ఈ నేపధ్యంలో
ఆయనను జిల్లా వక్స్ బోర్డు చైర్మన్ గా నియమించడం జరిగింది. వైసీపీ పార్టీలో
ముస్లిం మైనార్టీల్లో మంచి పేరు సంపాదించుకున్న గౌస్ మొహిద్దీన్ గతంలో వైసీపీ
36వ డివిజన్ అధ్యక్షులు (2011-2014)గా పనిచేసారు. అలాగే విజయవాడ నగర
వై.ఎస్.ఆర్.సి.పి. మైనారిటీ అధ్యక్షుడు (2015- 2017)గా సేవలందించారు. అనంతరం
వైసీపీ విజయవాడ పార్లమెంట్ పార్టీ మైనారిటీ అధ్యక్షుడు (2018-2019)గా
పనిచేసారు. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా వైసీపీ మైనార్టీ అధ్యక్షునిగా ఆయన
సేవలందిస్తున్నారు. గతంలో 2009లో దివంగత మహానేత డా. వై.యస్. రాజశేఖరరెడ్డి
మరణానంతరం నుండి ఆయన కుమారుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నగరంలో
గౌస్ మొహిద్దీన్ పెద్దఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా విజయవాడ
పశ్చిమ నియోజకవర్గంలో జగన్కు మద్దతుగా మొట్టమొదటగా వందలాది మందితో మద్దతు సభ
నిర్వహించారు. 2011 లో జగన్ చేపట్టిన ఓదార్పుయాత్ర సందర్భంలో పశ్చిమ
నియోజకవర్గంలో జగన్ బహిరంగ సభ నిర్వహించారు. వైసీపీ పార్టీ పిలుపునిచ్చిన అనేక
కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. అదే సందర్భంలో అప్పటి ప్రభుత్వ ప్రజా
వ్యతిరేక నిర్ణయాలమీద, ప్రభుత్వ వైఫల్యాల మీద అనేక ఉద్యమాలు చేసారు.
పార్లమెంట్ జిల్లా మైనారిటీ అధ్యక్షుడిగా మైనారిటీ ప్రచార కరపత్రాలను
ముద్రించి వాటిని జగన్ ఆవిష్కరింప చేసి జిల్లాలోని అన్ని నియోజక వర్గాలలో
విస్తృతంగా పంపిణీచేసారు. నగరంలో నిర్వహించిన ఆనాటి లక్ష్య దీక్ష కార్యక్రమం
నుండి మొన్నటి ప్రజాసంకల్ప పాదయాత్ర వరకు ప్రతి కార్యక్రమంలో జగన్ వెంట
నడిచారు. కాగా గౌస్ మొహిద్దీన్ సతీమణి బీజానీ గతంలో కార్పొరేటర్ పనిచేసారు.