ఏలూరు : ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, రిటైర్డు కాంట్రాక్టు & ఔట్
సోర్శింగు ఉద్యోగుల దీర్ఘకాలిక ఆర్ధిక, ఆర్ధికేతర సమస్యల పరిష్కారానికి గత
ఏడాది పిభ్రవరి నెలలో 11 వ పిఆర్శీ అమలులో భాగంగా జరిగిన ఉద్యమం సందర్భంగా
ముఖ్యమంత్రి, మంత్రివర్గ ఉపసంఘం అంగీకరించిన డిమాండ్లు అమలుచేయడంలో ప్రభుత్వం
నిర్లక్ష్య ధోరణితో సమస్యల పరిష్కారంలో జాప్యం చేస్తున్నందునే మార్చి 9 నుండి
ఏప్రీల్ 3 వరకు దశలవారిగా ఉద్యమానికి సిద్దపడి, ఆందోళనా కార్యక్రమాలు
ప్రారంబించ బోతున్నామని, ఇది ప్రభుత్వానికి వ్యతిరేక పోరాటం కాదని ఉద్యోగుల
న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపడుతున్న పోరాటమని ఏపిజెఏసి అమరావతి చైర్మన్
బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు తెలిపారు.
గురువారం ఏలూరు రెవిన్యూభవన్ లో ఏలూరు/పశ్చిమగోదావరి రెండు జిల్లాల ఉద్యోగులను
ఉద్యమానికి సిద్దం చేసేందుకు ముందుగా జిల్లా, డివిజన్ స్థాయి అన్నీ శాఖల
నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిధులుగా పాల్గొన్న బొప్పరాజు
వెంకటేశ్వర్లు, పలిశెట్టి దామోదరరావు లు మాట్లాడారు.
ఈ సమావేశం ప్రారంభంలో ఏపిపిటిడి(ఆర్టీసి)ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర
అధ్యక్షులు, ఏపిజెఏసి అమరారతి మాజీ సెక్రటరీ జెనరల్ వై.వీ.రావు ఇటీవల అకాల
మరణానికి చింతిస్తూ ఏలూరు జిల్లా ఆర్టీసి ఎంప్లాయిస్ నాయకులు ఏర్పటుచేసిన
సంతాపసభలో ముందుగా వారికి నివాళులు అర్పించి ఆయన సేవలను నాయకులు కొనియాడారు. ఈ
సందర్బంగా ఏపిజెఏసి అమరావతి నాయకులు మాట్లాడుతూ స్వయానా ఉద్యోగ సంఘాలకు
ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు కానప్పుడు ఇంక ఎవరికి చెప్పుకోవాలో అర్దంకాని
పరిస్దితిలో ఈ ఉద్యమానికి సిద్దపడ్డాం అన్నార.
ఉద్యోగుల జీతభత్యాల కొరకు కేటాయించిన బడ్జెట్ ఏమౌతుందో తెలియడంలేదు. అసలు మా
డబ్బులు ఎవరికి మళ్లీస్తున్నారు?. మాకు ప్రతి నెలా పనిచేసిన కాలానికి ఒకటో
తారీకు జీతాలు/పెన్సస్ లు ఎందుకు ఇవ్వరు? . మా జీతాలు/ పెన్సస్ లు కోసం
నిధులు కేటాయించలేదా?. కేటాయిస్తే, ఎందుకు ప్రతి నెల జీతాలు 20వ తేదీ వరకు
ఇస్తూనే ఉన్నారు?. మేము దాచుకున్న డబ్బులు ఏమయ్యాయి?. ఒకవేళ మా డబ్బులు
ప్రభుత్వం వాడుకొకపోతే, ఎందుకు మేము కోరుకున్నప్పుడు మా కుటుంబ అవసరాల కోసం
చెల్లించడం లేదు?. మా డబ్బులు వాడుకొనే హక్కు ప్రభుత్వానికి ఎవరిచ్చారు?. అని
వారు ప్రశ్నించారు.