విజయవాడ : ఏపీకి రావాలని ప్రజలు తనను ఆహ్వానిస్తున్నారని, పార్టీ అధిష్టానం
ఆదేశాలమేరకు నిర్ణయం తీసుకుంటానని కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి చెప్పారు.
ఏపీలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి
మండిపడ్డారు. రౌడీయిజం చేస్తూ ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని
దుయ్యబట్టారు. బుధవారం విజయవాడ వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. అమరావతి
రైతులు మూడేళ్లుగా ఆందోళన చేస్తుంటే సీఎం పట్టించుకోకపోవటం దారుణమన్నారు.
నాలుగేళ్లుగా నరకం అనుభవిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు వచ్చే ఎన్నికల్లో
అధికారపార్టీకి ఓటుతో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఏపీకి రావాలని ప్రజలు
తనను ఆహ్వానిస్తున్నారని, పార్టీ అధిష్టానం ఆదేశాలమేరకు నిర్ణయం తీసుకుంటానని
రేణుకా చౌదరి చెప్పారు. తాను రాష్ట్రంలో ఎక్కడైనా తిరుగుతానని. ఎవరు ఆపుతారో
చూస్తానని హెచ్చరించారు. ఏమైనా అంటే కులాలను అడ్డంపెట్టుకుని
మాట్లాడుతున్నారని, ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు. పార్టీ పేరులో
తెలంగాణ అనేదే లేకుండా చేసిన వ్యక్తి అక్కడి వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు
ఇతర రాష్ట్రాల్లో తిరుగుతానని అంటున్నారని బీఆర్ఎస్ను ఉద్దేశించి
రేణుకాచౌదరి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ పెద్ద కుటుంబమని,
భేదాభిప్రాయాలు ఉంటాయే తప్ప ఇతర పార్టీల్లో మాదిరి కాదన్నారు.