విజయవాడ : స్థానిక భవానిపురం 42వ డివిజన్లో గల శ్రీ వెంకట సాయిశ్రీ
వృద్దాశ్రమంలో నివసిస్తున్న వృద్దులకు బుధవారం నాడు మాజీ మంత్రి పశ్చిమ
నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి పింఛన్లు పంపిణి చేసారు అనంతరం
డివిజన్లలోని 127,130 సచివాలయాలను సందర్శించి సంక్షేమ పధకాలు ఏ విధంగా
అందుతున్నాయి అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.అనంతరం హెచ్ బి కాలని లో గల
అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి అక్కడ పిల్లలతో మాట్లాడారు
అన్ని మంచిగా అందుతున్నాయా అని తల్లులను అడిగి తెలుసుకుకున్నారు. ఈ సందర్బంగా
వెలంపల్లి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు ఒకటో
తారీకు కావడంతో వృద్ధాశ్రమంలో పింఛన్లు పంపిణి చేయడం జరిగిందన్నారు. గతంలో
ఎన్నడూ లేని విధంగా ప్రతి నెల ఒకటవో తేదీన అవ్వాతాతలకు ఉదయాన్నే ప్రతి ఒక్కరి
ఇంటికి వెళ్లి పింఛన్ ఇస్తున్న ఘనతగా వైకాపా ది అని కొనియాడారు. సచివాలయాలు
ద్వారా అందరికి అన్ని సంక్షేమ పధకాలు అందించడం జరుగుతుందన్నారు. అంగన్వాడీ
కేంద్రం ద్వారా పిల్లలకు పౌష్ఠికారాం అందిస్తున్నామన్నారు. బాలింతలకు కూడా
మంచి పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్
పడిగపాటి చైతన్య రెడ్డి, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్స్, సచివాలయ
సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.