కడప : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు పై సీబీఐ విచారణ
కొనసాగుతోంది. విచారణలో భాగంగా వైకాపా ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తండ్రి
భాస్కర్‌రెడ్డికి కేంద్ర దర్యాప్తు సంస్థ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈనెల 12
కడప కేంద్ర కారాగారంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో సీబీఐ పేర్కొంది.
పులివెందులలోని భాస్కర్‌రెడ్డి నివాసానికి వెళ్లి నోటీసులను అందజేసింది. గతనెల
23 విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీసులు ఇవ్వగా ముందుగా నిర్ణయించుకున్న
కార్యక్రమాలతో రాలేకపోతున్నట్లు ఆయన సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈనెల 12న
విచారణకు రావాలని సీబీఐ నోటీసులు ఇచ్చింది.