అమరావతి : రాష్ట్రంలో ఆలయం లేని ఊరు ఉండకూడదన్న ప్రాతిపదికన పెద్ద ఎత్తున
దేవాలయాల నిర్మాణాలను చేపట్టిన్నట్లు ఉప ముఖ్యమంత్రి మరియు దేవాదాయ, ధర్మాదాయ
శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. మంగళవారం అమరావతి సచివాలయం నాల్గో
బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో ఆయన పాత్రికేయులతో మట్లాడుతూ తన అధ్యక్షతన నేడు
జరిగిన సి.జి.ఎఫ్.కమిటీ సమావేశంలో పలు నిర్ణయాలను తీసుకోవడం జరిగిందని
తెలిపారు. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాల
మేరకు హిందూ ధర్మ పరిరక్షణకు మరియు హిందూ ధర్మంపై పెద్ద ఎత్తున ప్రచారం
చేసేందుకు రాష్ట్రంలోని పలు బడుగు, బలహీన వర్గాల ప్రాంతాల్లో హిందూ దేవాలయాల
నిర్మాణాలను పెద్ద ఎత్తున చేపట్టడమైనది తెలిపారు. ప్రతి దేవాలయ నిర్మాణానికి
టి.టి.డి. శ్రీవాణి ట్రస్టు అందజేసే రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని ఈ దేవాలయాల
నిర్మాణానికి వినియోగించుకుంటున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే
చేపట్టిన 1,330 దేవాలయలకు అదనంగా మరో 1,465 దేవాలయలను చేపట్టడమైందని ఆయన
తెలిపారు. అదే విధంగా పలువురు ప్రజాప్రతినిధుల అభ్యర్థన మేరకు నియోజక వర్గాల
వారీగా మరో 200 దేవాలయాలు చేపట్టేందుకు ఆమోదం తెలపడం జరిగిందన్నారు. రాష్ట్ర
దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆద్వర్యంలో చేపట్టిన 978 దేవాలయాల నిర్మాణ పనులు
ముమ్మరంగా సాగుతున్నాయని, ప్రతి 25 దేవాలయాల నిర్మాణాల పనుల బాధ్యతలను ఒక
సహాయక ఇంజనీరుకు అప్పగించడం జరిగిందని, ఇందుకు అవసరమైన ఏ.ఇ.లను ఆవుట్
సోర్సింగ్ పైకూడా తీసుకోవడం జరిగిందన్నారు. మిగిలిన దేవాలయాల నిర్మాణాలను ఇతర
స్వచ్ఛంధ సంస్థల ఆద్వర్యంలో నిర్వహించడం జరుగుచున్నదన్నారు.
అదే విధంగా పలు దేవాలయాల పునరుద్దరణకు మరియు ధూపదీప నైవేద్యాలకై మంజూరు
చేసిన సి.జి.ఎఫ్. నిధులు రూ.270 కోట్లలో ఇప్పటికే రూ.238.19 కోట్లను విడుదల
చేయడం జరిగిందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. సి.జి.ఎఫ్. నిధులతో ఇప్పటికే రూ.68
కోట్ల విలువైన పనులు చేపట్టగా,మిగిలినవి టెండర్ దశలో ఉన్నాయన్నారు. ఈ ఏడాది
ధూపదీప నైవేద్యం పథకం ప్రతి దేవాలయాలనికి నెలకు రూ.5 వేలు ఇచ్చేందుకై బడ్జెట్
లో కేటాయించిన నిధులు రూ.28కోట్లలో ఇప్పటి వరకూ రూ.14.74 కోట్లును
వెచ్చించడమైందన్నారు. ధూపదీప నైవేద్యం పథకం 2019 నాటికి కేవలం 1,561
దేవాలయాకు మాత్రమే వర్తింపచేయగా, నేడు 5 వేల దేవాలయాల వరకు ఆ పథకాన్ని
విస్తరించడం జరిగిందని ఆయన తెలిపారు.
శ్రీశైలంలో కొత్తగా సత్రాలు నిర్మించేందుకు ముందుకు వచ్చే వారి విషయంలో నూతన
విధానాన్ని అమలు పర్చేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఉప ముఖ్యమంత్రి
తెలిపారు. కొత్తగా నిర్మించే సత్రాల్లోని రూముల బుకింగ్ విషయంలో దాదాపు 40
శాతం మేర ఆదాయం దేవాలయాలనికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం
జరుగుచున్నదన్నారు. అదే విధంగా పలు సామాజిక వర్గాలు శ్రీ శైలంలో సత్రాలను
నిర్మించుకునేందుకు ఇప్పటికే అవకాశం కల్పించడమైందన్నారు.