వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, ప్రొఫెసర్ డి ఏ ఆర్ సుబ్రహ్మణ్యంగుంటూరు : ఆంధ్రప్రదేశ్ లో వివిధ రంగాలలో అభివృద్ధి కాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్
అభివృద్ధి అధ్యయన వేదికను మార్చి నాలుగో తేదీన విజయవాడలోని హోటల్ ఐలాపురం
కాన్ఫరెన్స్ హాల్లో ప్రారంభిస్తున్నట్లు శాసనమండలి సభ్యులు కే.ఎస్
లక్ష్మణరావు, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి,
ప్రొఫెసర్ డి ఏ ఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈనెల 28వ తేదీన గుంటూరులోని
జనచైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అధ్యయన వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం
అభివృద్ధి సాధించే దిశగా చేపట్టిన విధానాలు,సాధించిన ఫలితాలు, అవకాశాలు,
సవాళ్లకు సంబంధించిన విషయాలను విమర్శనాత్మకంగా ప్రజాహితం లక్ష్యంగా అధ్యయనం
చేస్తుందన్నారు.
చట్టబద్ధ పాలన సుపరిపాలన, గ్రామ స్వరాజ్, అభివృద్ధి వికేంద్రీకరణ,అవినీతి రహిత
సమాజ స్థాపన కోసం అధ్యయనం చేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అధ్యయన
వేదిక వర్తమాన సామాజిక,ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అంశాలపై వివిధ ప్రాంతాలలో
సదస్సులు నిర్వహించి ప్రజలను చైతన్యవంతులను చేస్తుంద అన్నారు. సామాజిక
ప్రజాస్వామ్యాన్ని సర్వతోముఖమైన అభివృద్ధిని రాష్ట్ర ప్రజలు సాధించేందుకు ఆ
దిశగా ప్రజాభిప్రాయాన్ని ప్రోది చేయటానికి,ప్రభావితం చేయడానికి కృషి
చేస్తుందన్నారు. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం,ఉద్యోగ ఉపాధి కల్పన, వ్యవసాయ
పారిశ్రామిక రంగాల పురోగతి, అవస్థాపన సౌకర్యాల అభివృద్ధి, రాజకీయ పార్టీల
పనితీరు,ప్రజాస్వామ్య పరిపుష్టి తదితర అంశాలపై నిష్ణాతులతో చర్చా గోస్టులు
నిర్వహించి ప్రచారాన్ని నిర్వహిస్తామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా సమాజ
హితం కోరే మేధావులు, ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలను కలుపుకొని ఐక్యంగా కృషి
చేస్తామని వివరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అధ్యయన వేదిక బుక్
లెట్ ను ఆవిష్కరించారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అధ్యయన వేదికను రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి.గోపాల్ రావు
ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పూర్వ చీఫ్ సెక్రటరీ
ఎల్వీ సుబ్రమణ్యం, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ పి.కృష్ణయ్య, శాసన మండలి
సభ్యులు కేఎస్ లక్ష్మణ్ రావు, ప్రముఖ రాజనీతి శాస్త్ర ఆచార్యులు ప్రొఫెసర్
కొండవీటి చి న్నయ్య సూరి, న్యాయ శాస్త్ర నిపుణులు ఆచార్య నాగార్జున
విశ్వవిద్యాలయ పూర్వ రిజిస్టర్ ప్రొఫెసర్ ఎన్.రంగయ్య, ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల
సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముప్పాళ్ళ సుబ్బారావు, చరిత్ర ఆచార్యులు ప్రొఫెసర్
మొవ్వ శ్రీనివాస్ రెడ్డి, నవ్యాంధ్ర ఇంటలెక్షు వల్ ఫోరం వ్యవస్థాపకులు
ప్రొఫెసర్ డి ఏ ఆర్ సుబ్రమణ్యం, సీనియర్ జర్నలిస్ట్ ఏఎం ఖాన్ తదితరులు
ప్రసంగిస్తారు. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి
అధ్యక్షత వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అధ్యయన వేదిక
కార్యవర్గాన్ని ఎన్నుకుంటుంది. భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తుంది.