విజయవాడ : రైతుల పాల సేకరణ ధరలు, నిర్వహణ, రవాణా ఖర్చులు పెరిగిన దృష్ట్యా
మార్చి 1 నుంచి విజయ పాల ధర అర లీటరు ప్యాకెట్‌పై రూ. 1 చొప్పున
పెంచుతున్నట్లు కృష్ణా మిల్క్ యూనియన్ మేనేజింగ్ డైరెక్టర్ కొల్లి
ఈశ్వరబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఆరు రకాల ప్యాకెట్లకు మాత్రమే ఈ ధర
వర్తిస్తుందన్నారు. అర లీటరు విజయ లోఫ్యాట్ (డీటీఎం) ధర రూ. 27, ఎకానమీ
(టీఎం) రూ. 29, ప్రీమియం (స్టాండర్డ్) రూ. 31, స్పెషల్ (ఫుల్ క్రీమ్) రూ.
36, గోల్డ్ రూ. 37, టీ-మేట్ రూ. 34 అయినట్లు వెల్లడించారు. పెరుగు, చిన్న
పాల ప్యాకెట్లు, ఇతర పాల పదార్థాల విక్రయ ధరల్లో ఎటువంటి మార్పు లేదని
తెలిపారు. నెలవారీ పాల కార్డుదారులకు మార్చి 9 వరకు పాత ధరలే వర్తిస్తాయని
వెల్లడించారు.