అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి హాజరైన క్రైస్తవ సంఘాల
ప్రతినిధులతో స సీఎం వైయస్.జగన్ మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. తమ సమస్యలను
బిషప్లు, రెవరెండ్లు ఇతర క్రైస్తవ సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రికి
నివేదించారు. ఏపీ ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్ తరపున క్రైస్తవ సంఘాల ప్రతినిధులు
హాజరయ్యారు. చర్చిల ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్న విషయాన్ని సీఎం దృష్టికి
క్రైస్తవ సంఘాల ప్రతినిధులు తీసుకు వచ్చారు. ఛారిటీ సంస్ధలు నడుపుతున్నవారికి
స్ధానిక పన్నుల నుంచి మినహాయింపు ఇవ్వాలని సీఎంకు క్రైస్తవ సంఘాల ప్రతినిధులు
విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా క్రైస్తవ సంఘాల ప్రతినిధులు విన్నవించిన పలు
అంశాలపై సానుకూలంగా సీఎం స్పందించారు. సీఎం మాట్లాడుతూ చర్చిలు, వాటి ఆస్తుల
రక్షణకై తగిన చర్యలు తీసుకునే దిశగా కార్యాచరణకు హామీ ఇచ్చారు. జిల్లా
స్దాయిలో సమస్యల పరిష్కారానికి ఎస్పీ, కలెక్టర్లు జిల్లా స్ధాయిలో సమస్యల
పరిష్కరిస్తారని సీఎం తెలిపారు. ఇకపై క్రిస్టియన్ సమాజం, సంఘాల ప్రతినిధుల
సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదించేందుకు ఒక సలహాదారును
నియమిస్తామని, తద్వారావారి సమస్యలను సులభంగా పరిష్కరించే వెసులుబాటు ఉంటుందని
సీఎం పేర్కొన్నారు. క్రిస్టియన్లకు స్మశానవాటికలు ఏర్పాటుపైనా ముఖ్యమంత్రి
సానుకూలంగా స్పందించారు.