విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ,ఏపీ బ్రాడ్
కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ లు సంయుక్తంగా ఈనెల 19న ఉగాది సంబరాలను ఘనంగా
నిర్వహించనున్నట్లు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీను బాబు, నగర
అర్బన్ అధ్యక్షులు పి నారాయణలు తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం లోని ఏపీ
ఎన్జీవో భవన్ లో అసోసియేషన్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా
కార్యవర్గం తీసుకున్న నిర్ణయాలను శ్రీనుబాబు, నారాయణలు పాత్రికేయులకు
వెల్లడించారు. ఆంధ్ర యూనివర్సిటీ అసెంబ్లీ హాల్ లో ఈ ఏడాది ఉగాది సంబరాలను
ఘనముగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆరోజు ఉదయం అల్పాహారంతో
కార్యక్రమాలుప్రారంభమవుతాయని, అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, కవిసమ్మేళనం,
పంచాంగ శ్రవణం పండిత సత్కారం నిర్వహిస్తామన్నారు. అంతేకాకుండా హాజరైన
జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులకు కోసం ప్రత్యేక లక్కీ డిప్ ఏర్పాటు చేయడం
జరిగింది అన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక కార్యక్రమాలు
నిర్వహిస్తామని, షడ్రుచులతో కూడిన విందు భోజనం కూడా ఏర్పాటు చేశామన్నారు. ఈ
ఉగాది సంబరాల్లో జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులు పాల్గొని జయప్రదం చేయాలని
కోరారు. సమావేశం లో జాతీయ కార్య వర్గ సభ్యులు జి.శ్రీనివాసరావు వైస్
ప్రెసిడెంట్ పి ఎస్. ప్రసాద్, రంగధామం, కోశాధికారి బి.సీతా రామమూర్తి, బ్రాడ్
కాస్ట్ అద్యక్షులు ఇరోతి ఈశ్వర రావు, కార్య వర్గ సభ్యులు ఎం వి రాజశేఖర్,
శేషు, గరికిన ఈశ్వర రావు, చిన్నా తదితరులు పాల్గొన్నారు.