విజయవాడ : వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రకృతి వ్యవసాయానికి అరుదైన గౌరవం
దక్కిందని రాజ్యసభ సభ్యులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన
కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం
ఇటీవల విడుదల చేసిన సామాజిక ఆర్థిక సర్వేలో ఏపీలో అమలవుతున్న ప్రకృతి
వ్యవసాయాన్ని ప్రశంసించిందని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,730 గ్రామాల్లో
6.30 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చెస్తున్నారని చెప్పారు. ఏ.పిలో
పారిశ్రామికాభివృద్ది పరుగులు తీస్తోందని, సిఎంగా జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు
చేపట్టన అనంతరం 2019 జూన్ నుండి 2023 జనవరి వరకు రూ.75,649.77 కోట్లు విలువైన
పెట్టుబడులు (ఎంఎస్ఎంఈ సహా) వాస్తవ రూపంలో వచ్చాయని చెప్పారు.