శ్రీకాకుళం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పార్టీ
నేతలతో అత్యవసర సమావేశాన్ని ఈనెల 28న ఉదయం 9.30 గంటలకు నిర్వహిస్తున్నామని
పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆదివారం ఒక
ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం నగరం 80 అడుగుల రోడ్డులో గల ఆనందమయి ఫంక్షన్
హాల్ లో ఈ సమావేశం జరగనుందని అన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎంఎల్సీ
అభ్యర్థి నర్తు రామారావు, ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ ఎంఎల్సీ అభ్యర్థి
సీతంరాజు సుధాకర్ గెలుపు కోసం వ్యూహాన్ని ఖరారు చేస్తామని పేర్కొన్నారు. ఈ
సమావేశానికి ప్రాంతీయ సమన్వయకర్త, జిల్లా ఇన్ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ,
జిల్లాలోని మంత్రులు, ఎంఎల్సీలు, శాసనసభ్యులు, నియోజకవర్గాల పరిశీలకులు,
జిల్లా పరిషత్ చైర్పర్సన్ హాజరై తగిన సూచనలు చేస్తారని తెలిపారు. అందువల్ల
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన పది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని
వైఎస్ఆర్ సీపీ జెడ్పీటిసి సభ్యులు, ఎంపీటీసీలు, కార్పొరేషన్, మున్సిపాలిటీల
చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు,
డైరెక్టర్లు, నియోజకవర్గాల వారీగా వివిధ విభాగాల ప్రతినిధులు తప్పనిసరిగా ఈ
సమావేశానికి హాజరు కావాలని కృష్ణదాస్ కోరారు.