సంబంధించి పట్టభద్రులు, ఉపాధ్యాయ ఓటర్ల తుది జాబితా విడుదలయ్యింది.ఆరు జిల్లాల్లో 320 పోలింగ్ కేంద్రాల పరిధిలో పట్టభద్రుల ఓటర్లు 3,81,181
మంది ఉన్నారు. 175 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఉపాధ్యాయ ఓటర్లు 27,694 మంది
ఉన్నారు. జిల్లాల పరంగా పరిశీలిస్తే.. పట్టభద్రుల, ఉపాధ్యాయ ఓటర్లు నెల్లూరులో
అత్యధికం.. బాపట్లలో అత్యల్పంగా ఉన్నారు.
శ్రీకాకుళం ఎమ్మెల్సీ బరిలో స్వతంత్ర అభ్యర్థి – వైఎస్ఆర్సీపీకి టెన్షన్ !
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ
ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. స్థానిక సంస్థలలో సంపూర్ణ బలం అధికార
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పటికీ స్వతంత్ర అభ్యర్థి ఒక్కరు నామినేషన్
వేయడంతో ఎన్నిక అనివార్యమ య్యే పరిస్థితి కనిపిస్తొంది.
నామినేషన్ల పరిశీలన పూర్తికావడంతో వైఎస్ఆర్సీపీ తరపున నామినేషన్ వేసిన నర్తు
రామారావుతో పాటు స్వతంత్ర అభ్యర్ధి గా ఆనెపు రామకృష్ణ పత్రాల పరిశీలను
పూర్తయిపో యింది. ఇద్దరి నామినేషన్లను ఆమోదించారు. నామినేషన్ల విత్ డ్రా కోసం
ఈ నెల 27 వరకు గడువు ఉంది. ఆ గడువులోగా స్వతంత్ర అభ్యర్థి అయిన అవెపు
రామకృష్ణతో నామినేషన్ ఉపసంహరింప చేసేందుకు తెరవెనుక ముమ్మరంగా యత్నాలు
జరుగుతున్నాయి. తూర్పు కాపు సంక్షేమ సంఘం నేతల మద్దతుతో రామకృష్ణ ప్రధానంగా
నామినేషన్ ను వేశారు. అటు అధికార వైఎస్ఆర్సీపీ ఇటు టిడిపి నేతలు తనకి అండగా
నిలుస్తారన్న ధీమాను ఆయన వ్యక్తం చేస్తున్నారు.
సామాజిక వర్గాల వారీగా లెక్కలు వేసుకుని తూర్పు కాపులకి వైఎస్ఆర్సీపీ అన్యాయం
చేసిందని వారు కుండబద్దలు గొట్టి చెబుతూ ఎన్నికలలో పోటీకి దిగారు. తూర్పు కాపు
సామాజిక వర్గానికి చెందిన అధికార పార్టీలో కీలక స్థానంలో ఉన్న వారు స్వతంత్ర
అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన రామకృష్ణకు మద్దతుగా నిలిచిన వారిపై కూడా
ఒత్తిళ్ళు చేస్తున్నారు. గతంలో జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు
అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా శత్రుచర్ల విజయరామరాజు
బరిలో నిలవగా తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన వైకాపా నేత మామిడి
శ్రీకాంత్ పోటీ కోసం నామినేషన్ దాఖలు చేసారు. అయితే చివరి నిమిషంలో ఆయన
నామినేషన్ ను ఉపసంహరించుకోవడంతో శత్రుచర్ల విజయరామరాజు ఏకగ్రీవంగా
ఎన్నికయ్యారు. ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి సంపూర్ణ బలం
ఉన్నందున ఏకగ్రీవంగానే ఎన్నిక జరుగుతుందని ఆ పార్టీ నాయకులంతా అనుకున్నారు.