సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు
రాష్ట్రానికి అన్యాయం చేసిన కేంద్ర బడ్జెట్ తీరుపై సిపిఎం ధర్నా
విజయవాడ : ఇటీవల కేంద్ర బడ్జెట్లో మన రాష్ట్రానికి అన్యాయం చేసిన మోడీ
విధానాలను తిప్పి కొట్టాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్
బాబురావు డిమాండ్ చేశారు. మన రాష్టానికి ద్రోహం చేసిన ప్రజా వ్యతిరేక కేంద్ర
బడ్జెట్ కు నిరసనగా శుక్రవారం వన్ టౌన్ హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద సిపిఎం నగర
కమిటీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర
ప్రభుత్వాల విధానాల తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. అనంతరం సిహెచ్.
బాబురావు మాట్లాడుతూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బడ్జెట్ రాష్ట్రానికి
తీరని అన్యాయం చేసిందన్నారు. సబ్సిడీల కోతలు, ఉపాధి కల్పించని కేటాయిం పులు,
సంక్షేమం కుదించే చర్యలు, ప్రభుత్వ రంగంలో వాటాల అమ్మకాలు సరికాదన్నారు.
ఆఖరికి పాలు, పెరుగుపై కూడా జీఎస్టీ విధించి పేదలను ఇబ్బందులకు గురిచేస్తుందనీ
అన్నారు. పన్నులు పెట్రోలు, గ్యాస్, డీజిల్ వంటి మీద కాదు ఆదాని అంబానీ లాంటి
వాళ్ళ మీద విధించాలన్నారు. దేశానికి కావలసిన సంపద అంబానీ, ఆదాని దగ్గర
ఉన్నాయని ఆయన ఆవేశం వ్యక్తం చేశారు. మతాల మధ్య ,ప్రజల మధ్య మత విద్వేషాలు
రెచ్చగొట్టడానికి బిజెపి ప్రభుత్వం కుట్ర పన్నుతున్న దన్నారు. 2014లో
వెంకటేశ్వర స్వామి సాక్షిగా అమరావతికి రాజధాని నిర్మాణానికి నిధులు
కేటాయిస్తానని చెప్పిన ప్రధాని మోడీ 2023 వరకు కూడా ఒక రూపాయి నిధులు కూడా
ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ఆదానికి లక్షల కోట్ల రూపాయలు ఆదాయాన్ని కట్ట
పెట్టారని మోడీపై విరుచుకుపడ్డారు. జాతీయ ప్రాజెక్టుగా ఉన్న పోలవరం ప్రాజెక్టు
ఇంతవరకు అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. దేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజల
బాగోగులు పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. కార్పొరేట్ సంస్థలైన
అదాని,అంబానీలకు కోట్ల రూపాయలను కట్టబెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ ,సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు కే. శ్రీదేవి మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ విధానాల వలన పేద, మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారం పడిందని
విమర్శించారు. పెట్రోలు, డీజిలు, వంట గ్యాస్ ధరలు ఇబ్బడి ముబ్బడిగా
పెరిగిపోయినందున సామాన్యులు జీవనం సాగించడం భారంగా మారిందని ఘాటుగా
విమర్శించారు. సిపిఎం పశ్చిమ సిటీ కార్యదర్శి బోయ సత్తిబాబు అధ్యక్షతన జరిగిన
ధర్నా కార్యక్రమంలో సిపిఎం సెంట్రల్ సిటీ కార్యదర్శి భూపతి రమణ రావు, తూర్పు
సిటీ నాయకులు పి కృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్య వర్గ సభ్యులు, సీఐటీయూ నాయకులు
ఏ వెంకటేశ్వరరావు. దుర్గారావు, ఈ.వి.నారాయణ, ఐద్వ నాయకులు,గాదె ఆదిలక్ష్మి,
స్వప్న ఆశ, ఏ. ఆశ వర్కర్స్ జిల్లా నాయకురాలు ఏ కమల, సిపిఎం నగర నాయకులు
కార్యకర్తలు పాల్గొన్నారు.