బొగ్గు నిల్వలపైనా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
అధికారులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశం
రైతుల వ్యవసాయ కనెక్షన్ల మంజూరులో జాప్యం ఉండకూడదు
వేసవిలో విద్యుత్ డిమాండ్, రైతులకు కనెక్షన్లపై అధికారులతో ఆయన సమీక్ష
గుంటూరు : రాష్ట్రంలో విద్యుత్ కొరత వల్ల కోతలనే మాట వినపించకూడదని
అధికారులను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. వేసవిలో విద్యుత్
డిమాండ్, రైతులకు కనెక్షన్లపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. వేసవిలో
విద్యుత్ కొరత లేకుండా చూడాలని ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. విద్యుత్ కొరత
వల్ల కోతలనే మాట వినిపించకూడదని అధికారులకు సూచించారు. కరెంట్ కోతలు లేకుండా
అధికారులు అన్ని రకాలుగా సిద్ధం కావాలన్నారు. విద్యుత్ శాఖపై సీఎం జగన్
మోహన్ రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు.
వేసవిలో విద్యుత్ డిమాండ్, రైతులకు కనెక్షన్లపై సమీక్షించిన సీఎం అధికారులకు
పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. బొగ్గు నిల్వలపైనా అధికారులు తగిన
జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. థర్మల్ కేంద్రాలకు బొగ్గు
కొరత రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రైతుల వ్యవసాయ కనెక్షన్ల మంజూరులో
జాప్యం ఉండకూడదని, దరఖాస్తు చేసిన నెలలోనే కనెక్షన్ ఇవ్వాలని ఆదేశించారు.
మార్చి నాటికి మరో 20వేల విద్యుత్ కనెక్షన్లు ఇస్తున్నామని అధికారులు ఈ
సందర్భంగా సీఎంకు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 100 సబ్స్టేషన్ల నిర్మాణం
పూర్తవుతోందని తెలిపారు.
బొగ్గు నిల్వల విషయంలో కూడా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, థర్మల్
కేంద్రాలకు బొగ్గు కొరతరాకుండా అన్నిరకాలుగా చర్యలు తీసుకోవాలన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా రైతులు పెట్టుకునే వ్యవసాయ కనెక్షన్లపై కీలక నిర్ణయం
తీసుకున్నారు. ఏ నెలలో దరఖాస్తు చేసుకుంటే అదే నెలలో మంజూరుచేయాలన్న సీఎం
ఆదేశాలను అమలు చేస్తామని అధికారులు పేర్కొన్నారు. రైతులకు కనెన్షన్ల
మంజూరులో ఎలాంటి జాప్యం జరగకూడదని సీఎం కోరారు. ఇది వరకే దరఖాస్తు చేసుకున్న
వారికి 1.06లక్షల కనెక్షన్లు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే మంజూరు చేశామని
అధికారులు వివరించారు. మార్చి నాటికి మరో 20వేల కనెక్షన్లుపైగా మంజూరు
చేస్తున్నామని, విద్యుత్ సరఫరా నాణ్యతను పెంచాలన్న సీఎం ఆదేశాల మేరకు అనేక
చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 100
విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం పూర్తవుతున్నట్టు వెల్లడించారు. మార్చి
నెలాఖరు నాటికి వీటిని పూర్తిచేస్తున్నామని, అలాగే పేదలందరికీ ఇళ్లు పథకం
కింద నిర్మాణాలు పూర్తిచేసుకుంటున్న వారికి వెంటనే కనెక్షన్లు
మంజూరుచేస్తున్నామని, ఇప్పటికే 2.18లక్షలకుపైగా ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చామని,
ఇళ్లు పూర్తవుతున్నకొద్దీ వాటికి కనెక్షన్లు శరవేగంగా ఇస్తున్నామని
పేర్కొన్నారు.
ఈ సమీక్షా సమావేశానికి విద్యుత్, అటవీ పర్యావరణం, మైన్స్ అండ్ జియాలజీశాఖ
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి,
ఇంధనశాఖ స్పెషల్ సీఎస్ కె విజయానంద్, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల
వలవెన్, ఆర్ధిక శాఖ కార్యదర్శి ఎన్. గుల్జార్, ట్రాన్స్‌కో జేఎండీ
పృధ్వీతేజ్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.