ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, అసెంబ్లీ వ్యవహారాలు, నైపుణ్యాభివృద్ధి,
శిక్షణ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్అమరావతి : అన్ని రంగాలలో పెట్టుబడులకు అవకాశమున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
ఒక్కటేనని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. ఈ విషయంలో
ఏపీకి ప్రత్యామ్నాయం లేదని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని ఐటీసీ కాకతీయ
హోటల్ వేదికగా శుక్రవారం ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన రోడ్ షోలో మంత్రి బుగ్గన
మాట్లాడుతూ గత మూడేళ్లలో 9.3 శాతం రాష్ట్ర ఎగుమతులు పెరిగాయన్నారు.82.5 గిగా
వాట్ల పునరుత్పాదక శక్తి సామర్థ్యం ఏపీ సొంతమన్నారు.ఆంధ్రప్రదేశ్ లో వివిధ
రంగాలలో పెట్టుబడులకు అనువుగా భౌగోళిక పరిస్థితులు కలిగి ఉండడం ఏపీ ప్రత్యేకత
అని మంత్రి తెలిపారు. ప్రపంచంలో తెలుగువారు లేని ప్రాంతం లేదన్నారు.
పోర్టులు, ఎయిర్ పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, రైల్వే, జాతీయ రహదారులు
పుష్కలంగా ఉన్న ఏపీలో పారిశ్రామికంగా ఎదగడానికి అవకాశాలు అపారంగా
ఉన్నాయన్నారు. మరీ ముఖ్యంగా ఔషధ రంగ పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ చిరునామాగా
మారిందన్నారు. ఇటీవల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల సందర్భంగా ఏపీ గురించి
పారిశ్రామికవేత్తలు చెప్పే మాటలే పెట్టుబడిదారులకు సాక్షమని మంత్రి బుగ్గన
రాజేంద్రనాథ్ వెల్లడించారు. పరిశ్రమల స్థాపనకు కీలకమైన నీరు, విద్యుత్ కి
ఏపీలో ఏ లోటు లేదని ఆయన పునరుద్ఘాటించారు. నైపుణ్య కొరతను అధిగమించే నైపుణ్య
శిక్షణకు ఏపీ పెద్దపీట వేస్తోందన్నారు. ఈ సందర్భంగా విశాఖ వేదికగా మార్చి 3,4
తేదీలలో జరిగే ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు ఏపీ తరపున ఆయన ఆహ్వానం పలికారు.
అంతకు ముందు ఆర్థిక మంత్రి బుగ్గన కొత్త గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్
ప్రమాణస్వీకారం కోసం విజయవాడలోని రాజ్ భవన్ కు వెళ్లారు. అక్కడ ముఖ్యమంత్రి
వైఎస్ జగన్ గవర్నర్ కు సీఎం తన కేబినెట్ మంత్రుల పరిచయం చేసే కార్యక్రమానికి
హాజరై తిరిగి వచ్చి మంత్రి బుగ్గన హైదరాబాద్ రోడ్ షోకు హాజరయ్యారు. హైదరాబాద్
రోడ్ షోలో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్, ఏపీటీపీసీ ఛైర్మన్
రవీంద్రనాథ్ రెడ్డి, ఐ.టీ, నైపుణ్య శాఖ ముఖ్య కార్యదర్శి సౌరభ్ గౌర్, చేనేత,
జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత, పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి.సృజన, ఏపీ
మారిటైం బోర్డు సీఈవో షన్ మోహన్, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ తెలంగాణ సీఐఐ
వైస్ ఛైర్మన్ శేఖర్ రెడ్డి, రీజనల్ పాస్ పోర్ట్ అధికారి బాలయ్య, తదితరులు
పాల్గొన్నారు.