విశాఖలో ప్రతిష్టాత్మకంగా మార్చి 3, 4 తేదీల్లో నిర్వహించనున్న గ్లోబల్
ఇన్వెస్టర్ సమ్మిట్ సన్నాహకాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు
రాష్ట్రాలలో పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడానికి పలు రోడ్డు షోలను
నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లోని ఐటీసీ కాకతీయ
హోటల్ వేదికగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెడితే కలిగే ప్రయోజనాలను
పారిశ్రామికవేత్తలకు ఆంధ్రప్రదేశ్ తరపున ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్
నేతృత్వంలోని ప్రతినిధి బృందం పాల్గొని వివరించారు. ఈ సందర్భంగా పలువురు
మాట్లాడారు.
ఐటీ డెస్టినేషన్‌గా విశాఖపట్నం – ఐటీ మంత్రి గుడివాడ అమర్నాధ్
హైదరాబాద్ లానే విశాఖపట్నం కూడా కాస్మోపాలిషియన్ సంస్కృతితో వేగవంతమైన
పట్టణీకరణ, అభివృద్ధిని కలిగి ఉంది. సుందరమైన వాతావరణం,సుదీర్ఘ సముద్ర తీరం
వంటి వాటితో విశాఖపట్నం అన్ని రంగాలకు వసతులు కల్పించనుంది. ప్రపంచ ఐటీ
డెస్టినేషన్‌గా విశాఖపట్నంపై మార్చడానికి ప్రయత్నిస్తున్నాం. మూడు
పారిశ్రామిక కారిడార్లు ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. విశాఖపట్నం-చెన్నై,
చెన్నై-బెంగళూరుతో పాటు హైదరాబాద్-బెంగళూరు కారిడార్లను ఏపీ కలిగి ఉంది.
ఏపీ అన్ని రకాల ఎగుమతులు దిగుమతులకు ఆసియా దేశాలకు ముఖ ద్వారం – ఆర్థిక మంత్రి
బుగ్గన
ఆటోమోటివ్‌లో, అశోక్ లేలాండ్, కియా, హీరో, ఇసుజు, అపోలో, యోకోహామా, భారత్
ఫోర్జ్ వంటివి ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్ డిజైన్ అండ్ తయారీలో బ్లూ స్టార్,
ఫాక్స్‌కాన్, డయాకాన్, పానాసోనిక్, జడ్ టీటీ, ఫ్లెక్స్, వింటెక్ వంటి
క్లస్టర్లను ఏపీ కలిగి ఉంది. అలాగే మొబైల్ తయారీకి ఏపీ కేంద్రంగా ఉంది.
ఫార్మాస్యూటికల్స్ కు హైదరాబాద్‌తో పాటు ఏపీలో మైనోల్న్, బయోకాన్, లుబెన్,
హెటెరో, లూరెస్, దివిస్, ఆరిబిందో, జీ.ఎస్.కె, డాక్టర్ రెడ్డిస్, వంటివి
ఉన్నాయి. ఏపీలో వ్యాపార వాతావరణం కోసం సరైన పర్యావరణ వ్యవస్థ ఉందని తెలిపారు.
ఇవన్నీ వరుసగా మూడేళ్లపాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ నంబర్ 1 స్థానంలో
ఉండేలా చేసిందని ఆయన గుర్తు చేసారు.
జంట నగరాలుగా వైజాగ్, విజయనగరం – రవిచంద్రారెడ్డి
హైదరాబాద్‌లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023లో పారిశ్రామికవేత్తలను
ఉద్దేశించి ఏపీటీపీసీ చైర్మన్ రవిచంద్రారెడ్డి మాట్లాడుతూ రానున్న రోజుల్లో
విజయనగరం, వైజాగ్ జంట నగరాలుగా ఆవిర్భవిస్తాయని అన్నారు.కాకినాడ, నెల్లూరు,
కడప ఇలా అనేక ఇతర జిల్లాలలో అనేక ప్రోత్సాహకాలు అందించడం ద్వారా అపారమైన
అవకాశాలను ఏపీ అందిస్తుంది.
ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఏపీ అగ్రగామి – భరత్ కుమార్ తోట, చీఫ్ ఆపరేటింగ్
ఆఫీసర్, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్
హైదరాబాద్‌లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌లో భరత్ మాట్లాడుతూ..
కోకో ఉత్పత్తిలో 70% ఆంధ్రప్రదేశ్ నుండి వస్తోందని, ఏపీ కేవలం రైస్ బౌల్
మాత్రమే కాదు, ఇది దేశంలోనే పెద్ద చాక్లెట్ బౌల్ అని, అరటిపండ్లు, ఆహారం,
సుగంధ ద్రవ్యాలు, టమాటా ప్రాసెసింగ్ కోసం ఏపీలో నాలుగు మెగా యూనిట్లు
రానున్నాయని అలాగే ఏపీ అతిపెద్ద పల్ప్ ఎగుమతిదారు, ఎక్కువ పల్ప్
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, అనంతపురం జిల్లాల నుండి వస్తుందని ఆయన తెలిపారు.