అమరావతి : టీడీపీ నేత పట్టాభిని కొట్టారంటూ ఈనాడు తప్పుడు వార్తలు రాయడంపై
మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. పనిగట్టుకుని ప్రభుత్వంపై ఈనాడు పత్రిక
దుష్ప్రచారం చేయడంలో భాగంగానే పట్టాభిని కొట్టారంటూ తప్పుడు వార్తను
ప్రచురించిందని ధ్వజమెత్తారు. 2021 ఫిబ్రవరి ఫోటోలను ఈనాడు ప్రచురించి
ప్రస్తుతం ఘటనకు ఆపాదించే ప్రయత్నించడం ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడంలో భాగం
కాదా? అని ప్రశ్నించారు. కుట్ర పన్ని ఈనాడులో రామోజీ బ్యానర్ వార్తను
ప్రచురించారని అంబటి విమర్శించారు. రేపు సాయంత్రంలోగా రామోజీ బహిరంగం
క్షమాపణలు చెప్పాలని, లేకుంటే రామోజీపై పరువు నష్టం దావా వేస్తామని
హెచ్చరించారు. పథకం ప్రకారం టీడీపీ కుట్రలకు పాల్పడుతోందని, పట్టాభిని
కొట్టారంటూ దుష్ప్రచారం చేస్తోందన్న అంబటి చంద్రబాబును అధికారంలోకి
తీసుకురావాలనే తపన రామోజీలో కనబడుతోందన్నారు. గన్నవరం ఘటనలో పోలీసులపై టీడీపీ
దాడి చేసి సీఐని గాయపరిచిన సంగతిని గుర్తుచేశారు. ప్రభుత్వంపై బురద జల్లడమే
లక్ష్యంగా ఈనాడు వ్యవరిస్తోందని మండిపడ్డారు. రామోజీ అనేక చట్ట వ్యతిరేక
కార్యక్రమాలకు పాల్పడ్డారని, ఆర్థిక నేరాల్లో అగ్రగణ్యుడు రామోజీనేనని అంబటి
ఘాటుగా వ్యాఖ్యానించారు. తిన్నింటి వాసాలు లెక్కబెట్టడం కన్నాకు అలవాటు :
నైతిక విలువలు లేనటువంటి వ్యక్తి కన్నా లక్ష్మీనారాయణ అని అంబటి విమర్శించారు.
చంద్రబాబు చేతిలో కన్నా రాజకీయ భవిష్యత్ శూన్యమని, తిన్నింటి వాసాలు
లెక్కబెట్టడం కన్నాకు అలవాటని అంబటి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నుంచి
బీజేపీలోకి వచ్చిన కన్నా ఇప్పుడు టీడీపీలోకి వెళ్లాడని, అసలు కన్నాకు బీజేపీ
రాష్ట్ర అధ్యక్ష పదవి ఎందుకిచ్చారో తెలియదన్నారు మంత్రి అంబటి.