విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లో రిటైర్డ్ పార్ట్ టైం గ్రామ రెవిన్యూ అధికారుల
రేషన్ కార్డుల సమస్యలపై ఎన్నోసార్లు సివిల్ సప్లై ఉన్నత అధికారులకు, రాష్ట్ర
పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లి
వారి యొక్క సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ
అధికారుల సంఘం కృషి చేసింది. దాని ప్రకారం సివిల్ సప్లై కమిషనర్ పదివేల లోపు
ఉన్న రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు రేషన్ కార్డులు ఇవ్వడానికి నిర్ణయం
తీసుకుని మెమో ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర గ్రామ రెవిన్యూ అధికారుల
సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూపతి రాజు రవీంద్ర రాజు మాట్లాడుతూ వీఆర్వోల సమస్యల
విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ప్రతి విషయంలోనూ మా గ్రామ రెవెన్యూ అధికారులకు,
ఇప్పుడు, రిటైర్డ్ పార్ట్ టైంగ్రామ రెవెన్యూ అధికారులకు, న్యాయం చేసినందుకు
ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి , పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట
నాగేశ్వరావు లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం
కృతజ్ఞతలు తెలిపింది. అలాగే ప్రస్తుతం అపరిష్కృతంగా ఉన్న గ్రేడ్ 2 వీఆర్వోల
ప్రొబిషన్ విషయంలో కూడా న్యాయం చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ
రెవిన్యూ అధికారుల సంఘం. రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు రవీంద్ర రాజు, రాష్ట్ర
ప్రధాన కార్యదర్శి ఎం. అప్పలనాయుడు తదితరులు మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.