విశాఖపట్నం : కురుక్షేత్ర వేదికగా విశాఖ శ్రీ శారదాపీఠం పర్యవేక్షణలో
కొనసాగుతున్న శ్రీ లక్ష చండీ మహా యజ్ఞం విజయవంతంగా కొనసాగుతోంది. యజ్ఞభూమిలో
గురువారం చండీ మాత మహా వారాహి అవతారంలో దర్శనమిచ్చింది. మరోపక్క యజ్ఞంలో 13వ
రోజు చండీ మాతను ఆరాధిస్తూ 6912 పారాయణ హోమాలు నిర్వహించారు. యజ్ఞంతో పాటు ఒకే
సమయంలో సప్తశతీ పారాయణ కూడా చేపట్టారు. విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి
స్వాత్మానందేంద్ర స్వామి, గుంతిమాత యజ్ఞాన్ని పర్యవేక్షించగా, పీఠాధిపతులు
స్వరూపానందేంద్ర స్వామివారు కురుక్షేత్ర సమీపంలోని పంచకుల ప్రాంతాన్ని
సందర్శించారు. అక్కడి చండీమాత ఆలయంలో పూజలు నిర్వహించారు. యజ్ఞం నిర్విఘ్నంగా
కొనసాగుతోందని, పరిపూర్ణమయ్యేలా నిర్వాహకులకు శక్తిని ప్రసాదించాలని చండీమాతను
ప్రార్ధించారు. అలాగే పంచకుల ప్రాంతంలోని కాళికా మందిరాన్ని, మానసాదేవి
మందిరాన్ని కూడా సందర్శించి కురుక్షేత్ర చేరుకున్నారు.