నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మానుపాటి నవీన్
విజయవాడ : గిరిజన పక్షాన నిలబడి అహర్నిశలు గిరిజనుల అభ్యున్నతికి కు కృషి
చేస్తున్న డాక్టర్ కుంభ రవిబాబు ను ఎం ఎల్ సీ అభ్యర్థిగా ప్రతిపాదించిన
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి యావత్ గిరిజన జాతి హర్షం వ్యక్తం
చేస్తుందని నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మానుపాటి నవీన్
అన్నారు. మంగళవారం విజయవాడ కరెన్సీ నగర్లో గల గిరిజన ఐక్య కార్యాచరణ కమిటీ
కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రజా సంఘాలకు
నాటి పాదయాత్రలో మాట ఇచ్చిన విధంగా గిరిజన రాజకీయ ప్రాధాన్యత కల్పించే విధంగా
సమర్ధుడైన నాయకుడికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం వల్లే గిరిజన అభ్యున్నతికి
ఉపయోగపడుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు
కుడుమల రామచంద్రయ్య మాట్లాడుతూ డాక్టర్ కుంభ రవిబాబు గారు ఎన్నో సంవత్సరం
నుంచి పార్టీలో కష్టపడుతూ పార్టీ బలోపేతానికి, గిరిజనుల అభ్యున్నతికి కృషి
చేసినందుకు ఎం ఎల్ సీ పదవి ఇచ్చి సరైనటువంటి గుర్తింపు ఇచ్చిన ముఖ్యమంత్రి
జగన్మోహన్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైకార్
డైరెక్టర్ మద్దెల రామకృష్ణ మాట్లాడుతూ 32 తెగల ఉన్నటువంటి గిరిజనుల అభ్యున్నత
కోసం ఎస్టీ కమిషన్ చైర్మన్ గా పలు గ్రామాల్లో తిరుగుతూ అనుకూల సంఘాలతోనూ
ప్రభుత్వ అధికారులతోనూ సమన్వయంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినటువంటి
డాక్టర్ కుంభా రవిబాబుకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపునిచ్చి ఎం ఎల్ సీ పదవితో
గుర్తించినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాగేంద్రనాయిక్, కుంభ
ఉదయ్ కుమార్, తోకల చినవిరోజి, కుంభ గోపి, కుతడి భులక్ష్మి, బొజ్జగాని పద్మ,
దేవరకొండ సాంబయ్య, మానుపాటి నవీన్ పాల్గొన్నారు.