ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం సంక్షేమం, పెట్టుబడుల అంశాల్లో ముందంజలో ఉందని, సీఎం
జగన్ రాష్ట్ర సుస్థిరాభివృద్ధి కోసం అమలు చేస్తున్న నాడు నేడు పథకం దేశానికే
తలమానికమని డిప్యూటీ సీఎం నారాయణస్వామి పేర్కొన్నారు. జీఎస్డీపీ మొదలు
పెట్టుబడుల ఆకర్షణ, నైపుణ్య, ఉపాధి శిక్షణ అంశాల్లో ఏపీ ఇతర రాష్ట్రాల కంటే
ముందంజలో ఉందన్నారు. అందుకు నిదర్శనమే గత ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ నమోదు
కంటే రాష్ట్ర జీఎస్డీపీ 11.43శాతంతో అధికంగా ఉందని వివరించారు.
పెట్టుబడుల కేంద్రంగా ఏపీ; ఎమ్మెల్సీ భరత్
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలన సాగుతోందని,
పెట్టుబడుల సాధనలో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో నిలవడం సీఎం జగన్ సమర్థతకు
నిదర్శనమని వైఎస్సార్ సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భరత్
అన్నారు. దేశవ్యాప్తంగా DPIIT డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ
నివేదిక ప్రకారం, 2022 జూలై చివరి నాటికి దేశ వ్యాప్తంగా రూ.1,71,285 కోట్ల
పెట్టుబడులు రాగా, ఏపీ ఇతర రాష్ట్రాలతో పోటీ పడి రూ.40,361 కోట్ల పారిశ్రామిక
పెట్టుబడులను ఆకర్షించి అగ్రస్థానంలో నిలిచిందని ఎమ్మెల్సీ తెలిపారు.
రాష్ట్రాభివృద్ధి పెట్టుబడులపై ఎల్లో మీడియాతో కలిసి తెదేపా కుట్ర రాజకీయాలు
చేస్తుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో కమిషన్ల కోసం పోలవరం ప్రాజెక్టు
నిర్మాణాన్ని నాశనం చేసిన చంద్రబాబు కొత్త అబద్దాలతో ఏకంగా తన పార్టీ
కార్యకర్తలను, నాయకులను కూడా మోసం చేసేందుకు సిద్ధమయ్యారని ఎమ్మెల్సీ
పేర్కొన్నారు.
రాష్ట్రంలో పెట్టుబడులపై ఎమ్మెల్సీ వెల్లడించిన వివరాలివీ..
మన రాష్ట్రం 11.43శాతం GSDPతో 2021-22లో దేశంలోనే అత్యంత వేగంగా
అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ కలిగిన రాష్ట్రంగా ఏపీ వుంది.
జాతీయ GDP 8.7 నమోదు అవ్వగా… రాష్ట్ర GSDP కేంద్ర జిడిపి కన్నా 2.73 శాతం
ఎక్కువ.
కొవిడ్ 19 సమయంలో భారత దేశ వృద్ది రేటు -6.60 శాతం నమోదైన సందర్భంలో కూడా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 0.08 శాతం వృద్దిరేటును నమోదు చేసింది.
రాష్ట్ర తలసరి ఆదాయం దేశ తలసరి ఆదాయం కన్నా 38.5 శాతం ఎక్కువ.
దేశంలోనే మన రాష్ట్ర తలసరి ఆదాయంలో 6వ స్ధానంలో వుంది.
చంద్రబాబు పాలనలో 2018-19లో 5.36 శాతం వృద్దిరేటు వుండగా.. సీఎం జగన్మోహన్
రెడ్డి పాలనలో 2021-22 నాటికి 11.43 శాతం వృద్దిరేటు నమోదైంది.
జూన్ 2022లో టైర్ల రంగంలో ప్రపంచంలోననే మొదటి ఐదు కంపెనీలలో ఒకటైన ATC
అలయన్స్ టైర్స్ రూ.1,240 కోట్లతో విశాఖపట్నంలో ప్లాంట్ కోసం పెట్టుబడి
పెట్టింది.