గుంటూరు : సామాజిక న్యాయంలో దేశానికే జగన్ మార్గదర్శి అని, ఎవరెస్టు
శిఖరమెక్కినంత సంబరాల్లో బీసీ వర్గాలు ఉన్నాయని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ
మంత్రి జోగి రమేష్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సామాజిక
విప్లవం, సామాజిక న్యాయం ఆంధ్ర ప్రదేశ్ నుంచే మొదలయిందని ముఖ్యమంత్రి జగన్
మోహన్‌రెడ్డి నాయకత్వం నిరూపిస్తోందన్నారు. జగన్ మా పట్ల చూపిన ప్రేమ
వెలకట్టలేనిది. ఏమిచ్చినా ఆయన రుణం తీర్చుకోలేం. శాసనమండలికి బీసీలకు,
ఎస్సీలకు, ఎస్టీలకు కేటాయించిన స్థానాలను చూసి, ఎవరెస్టు పర్వతమెక్కినంత
ఆనందంతో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు పొంగిపోతున్నారు. వార్డు మెంబరుగా కూడా
పోటీపడలేని మా వర్గాలను ఉన్నతమైన శాసనమండలిలో అడుగుపెట్టేలా చేసిన జగన్ కి
ఏమిచ్చి రుణం తీర్చుకుంటామని వారు సంబరాలు చేసుకుంటున్నారు. ఆయన మా పట్ల
చూపుతున్న ప్రేమను చూస్తే నిండు మనసుతో మేం ఆరాధించాలి. ప్రేమించాలి. ఇలాంటి
నాయకుడు ఆంధ్రప్రదేశ్‌కు సీఎం గా ఉన్నారంటే జయహో జగనన్న అంటూ ఆంధ్రావని అంతా
నినదిస్తోంది.
దేశమంతటికీ జగన్ మార్గదర్శి
సామాజిక న్యాయం జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యం. ఈ రోజు అందరూ ఆంధ్రావైపు
చూస్తున్నారు. సామాజిక న్యాయం అంశంలో అన్ని పార్టీలు, అందరు ముఖ్యమంత్రులు,
జాతీయ పార్టీలు సైతం జగన్ బాటలో నడవాల్సిన పరిస్థితి. మనసు నిండా బీసీ ఎస్సీ
ఎస్టీ మైనార్టీలను నింపుకుని ఆ ప్రేమను రుచి చూపిస్తున్నారు జగన్ గారు.
ఎప్పుడో జ్యోతిరావు ఫూలే కలలు కన్న సామాజిక న్యాయాన్ని 75 ఏళ్ల భారత చరిత్రలో
ఆంధ్రాలో మాత్రమే అమలయిందని అందరూ చెప్పుకుంటున్నారు.
టీడీపీలోని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు బాబుకు తొత్తులుగా మారొద్దు
టీడీపీలోని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలని
కోరుతున్నాను. జగన్ ని అనుసరించండి. మీరంతా బాబు పెత్తందారీ పోకడలను పక్కన
బెట్టండి. విద్య, ఆర్థిక, సామాజిక, రాజకీయ, మహిళా సాధికారత వంటి వాటికి అసలైన అర్థం జగన్
ప్రభుత్వంలోనే రుచి చూస్తున్నాం. డీబీటీ ద్వారా రూ.2 లక్షల కోట్ల బీసీ, ఎస్సీ,
ఎస్టీ, మైనార్టీ, పేదలకు అందుతోంది. ఈ రోజు ప్రతి గడపలో అభివృద్ధి, సంక్షేమం
కనిపిస్తోంది. ఎక్కడో ఒక్కచోటే ఇదంతా ఇచ్చేస్తే ఆ లబ్ధి బాబు సామాజిక
వర్గానికి, ఆయన తాబేదారులకు మాత్రమే లభించేదని, సీఎం బటన్ నొక్కి ఫీజు
రీయింబర్స్ మెంటు ఇస్తే మన పిల్లలు ఇంజినీర్లు, డాక్టర్లు అవుతున్నారు. ఇదంతా
ప్రతి గడపకు మనం చెప్పాల్సిన తరుణమిదని, జగన్ అడుగులో మనం అడుగేయాలని కోరారు.