విజయవాడ : ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు మంగళవారం కనక
దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు విచ్చేయగా ఆలయ
పాలకమండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి
వీరికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వీరికి ఆలయ వేదపండితులు
వేదాశీర్వచనం చేయగా ఆలయ పాలకమండలి చైర్మన్, అధికారులు అమ్మవారి ప్రసాదములు,
శేషవస్త్రంలు అందచేశారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు బుద్దా రాంబాబు,
కేసరి నాగమణి , ఆలయ కార్యనిర్వాహక ఇంజినీర్లు కె. వి. ఎస్ కోటేశ్వరరావు, ఎల్.
రమాదేవి , సహాయ కార్య నిర్వహణాధికారి ఎన్. రమేష్, వైదిక సిబ్బంది పాల్గొన్నారు.