గుంటూరు : పవన్ కల్యాణ్ ఆలోచనలకు అనుగుణంగా పార్టీ సిద్ధాంతాలను అనుసరిస్తూ
జనసేన వేదిక ద్వారా ప్రజా ప్రయోజన కార్యక్రమాలు నిర్వహిస్తున్న “కెనడా జనసేన
టీం”కు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు కొణిదెల నాగబాబు పేరు పేరునా
ప్రత్యేక అభినందనలు తెలిపారు. సోమవారం “జూమ్ కాల్”లో జరిగిన ముఖాముఖి
కార్యక్రమంలో కెనడా జనసైనికులతో మాట్లాడడం సంతోషంగా ఉందన్నారు. 2019 ఎన్నికల
సమయంలో కెనడా జనసేన టీం పార్టీకి అందించిన సేవలు, పర్యావరణ పరిరక్షణ కోసం
జనసేన వేదికగా మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహణ,”జనసేన రైతు భరోసా”, “నా సేన
కోసం-నా వంతు” కార్యక్రమానికి , “ఇప్పటం గ్రామానికి” అండగా చేసిన సహాయం జనసేన
పార్టీ ఎప్పటికీ మరువదు. తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం ఉన్న రాజకీయ, సామాజిక
స్థితగతులపై మీరంతా దృష్టి పెడుతున్న విధానం, జనసేన పార్టీ భవిష్యత్ కార్య
కలాపాలకు చేయూతగా “కెనడా జనసేన టీం” సంసిద్ధం అవుతున్న తీరు ప్రశంసనీయమని
జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు కొణిదెల నాగబాబు అన్నారు.