విజయవాడ : మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి కొత్తపేట సైకం వారి
వీధిలో ఉన్న శ్రీదర్భేశ్వర స్వామి వారి దేవస్థానంలో కొలువైవున్న
శ్రీదర్బేశ్వర స్వామి వారి పవళింపు సేవ ఘనంగా జరిగింది. మహాశివరాత్రి
ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రధాన అర్చకులు మురళి నేతృత్వంలో అర్చకులు స్వామి
వారికి అభిషేకములు , ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం ఆలయ ప్రాంగణంలో
ముత్తైదువులు కొట్నాలు దంచి తాంబూలాలు ఇచ్చుకున్నారు. అనంతరం గులాములు
చల్లుకొని వసంతోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం శ్రీ స్వామివారి చక్రస్నానం
నిమిత్తం కృష్ణా నది వరకు ఊరేగింపుగా వెళ్లి అక్కడ పూజా కార్యక్రమం
నిర్వహించిన అనంతరం దేవస్థానానికి తిరిగి తీసుకువచ్చారు. కాగా శ్రీ స్వామివారి
పవళింపు సేవా కార్యక్రమంలో దేవస్థానం వంశ పారంపర్య ధర్మకర్త రాంపిళ్ళ
జయప్రకాష్ కుటుంబీకులు, ప్రముఖ వ్యాపారవేత్త తమ్మిన మారుతి, ఇండియన్
సివిలైజేషన్ గాంధీ ట్రస్ట్ డైరెక్టర్ తమ్మిన సోనియా దంపతులు, తదితరులు
పాల్గొని భక్తిశ్రద్ధలతో స్వామివారిని అర్చించారు. ఈ కార్యక్రమంలో పెద్ద
సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాగా ఈనెల 16వ తేదీ నుండి శ్రీధర్భేశ్వర స్వామి
వారి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.